-మీకు చేతనైతే… దమ్ముంటే 2024లో జగన్‌ని గెలవకుండా ఆపండి
-బీజేపీ పెద్దలు అంత క్లోజ్ అయితే 8 ఏళ్లుగా పిలుపెందుకు లేదో..?
-బీజేపీతో నీకు సత్సంబంధాలుంటే రాష్ట్రానికేం ఒరిగింది…?
-చేతనైతే డేటా చౌర్యం ఎక్కడో నిరూపించు..
-డేటా దొంగ చంకలో కూర్చొని డేటా డేటా అంటున్నావ్..!
-మీ డేటా అంతా కేసీఆర్ వద్దనే ఉంది..
-నిస్వార్థ సేవ చేస్తున్న వాలంటీర్లపై అపనిందలా..?
-వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్న డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది
-జగన్ బలం వాలంటీర్లనే ఈ నిందలు: మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని
-జగన్ కి నీ మీద జాలి తప్ప కోపం ఎందుకుంటుంది..?
-నాడు చంద్రబాబు డేటా అమ్మితే ఈ ఊపుడేమైంది..? రంకెలేమయ్యాయి..?
-ఆ ఎఫ్ఓఏ ఎవడో…ఏ నిఘా సంస్థలతో విచారణ చేయిస్తావో చేయించు..
-జనసేన సభ్యత్వానికి చేస్తున్నదీ డేటా చౌర్యమేనా..?
-కేంద్రం తీస్తున్న జనాభా లెక్కల వివరాలపై మోడీ, అమిత్‌షాలను కూడా ప్రశ్నిస్తావా..?
-మాజీ మంత్రి పేర్ని నాని
చెప్పిన పని సరిగ్గా చేయకపోతే పవన్‌ను చంద్రబాబే కొట్టాలి:
పవన్ కల్యాణ్‌కి చేతలు తక్కువ మాటలు ఎక్కువ…
జగన్ ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేయమని జీవో ఇచ్చిందని సొల్లు కబుర్లు చెప్తున్నాడు.
కోర్టులో దావా ఫైల్ చేయమని సంబంధిత గ్రామ వార్డు సచివాలయ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
అనైతికంగా, దుర్మార్గంగా తప్పుడు నిందలు వేస్తున్న వారి వల్ల వాలంటీర్లలో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.
వాలంటీర్ల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా, వారిలో విశ్వాసం నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నన్ను ప్రాసిక్యూట్ చేసుకోండి..అరెస్టు చేసుకోండి దెబ్బలు తినడానికైనా సిద్ధం అంటాడు.
నిన్నెవరు కొడతారు…నువ్వు సరిగ్గా రాజకీయాలు చేయకపోతే చంద్రబాబు కొట్టాలి..
నువ్వు చేతులు కట్టుకుని నిల్చునేది ఎవరివద్ద అమిత్‌షా, మోడీ, చంద్రబాబు వద్దే కదా..చెప్పిన పని సరిగ్గా చేయడం లేదని వారు కొట్టాలి.
కేసులో తీర్పు వస్తే జడ్జిగారే తప్పుడు మాటలని రుజువైతే జైల్లో వేస్తాడు..అప్పుడు రెడీగా ఉండు.
అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతున్నా అంటాడు..అసలేం రిస్కులు తీసుకున్నాడీయన.
సినిమాలను వదిశాను నా జీవితం ప్రజలకే అంకితం అన్నాడు..వందకోట్ల ఆదాయం వదిలేసుకున్నాను అన్నాడు.
మళ్లీ ఇప్పుడు 3 పూటలా సినిమా షూటింగులు చేసుకుంటూ జాగ్రత్తగా సంపాదించుకుంటున్నాడు.
రిస్క్ ఉంటే చంద్రబాబుకి ఉండాలి..పవన్ కల్యాణ్‌పై పెట్టుబడి ప్రొడ్యూసర్ పెట్టిన వారికి రిస్క్ ఉంటుంది.
రాజకీయాల్లోకి వస్తే ఎంత బరితెగించైనా మాట్లాడ వచ్చనే తప్పుడు ఆలోచనతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు.
జగన్ బలం వాలంటీర్లనే ఈ నిందలు:
నిస్వార్ధంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై నోటికొచ్చినట్లు తూలనాడాడు.
జగన్ బలం వాలంటీర్లలోనే దాగుందని, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా జగన్ గారు ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేసుకోగలిగాడని వారిలో భయం పట్టుకుంది.
అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతసేపూ డేటా చౌర్యం అంటూ మాట్లాడుతున్నాడు.
సిగ్గు శరం లేకుండా చంద్రబాబు, పవన్ జంటగా నడిపిన ప్రభుత్వంలో ప్రజా సాధికారిక సర్వే పేరుతో డేటా పోగు చేసి ఆ డేటాను హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీకి అందించారు.
ఈ డేటాను దొంగతనంగా వారికి పంపితే..తెలంగాణ ప్రభుత్వం వారందరినీ పట్టుకుని అరెస్టులు చేస్తే పవన్ కల్యాణ్‌కి ఆనాడు నోట్లోంచి మాట రాలేదు.
ఈ రోజు ఊగుతూ రంకెలేసుకుంటూ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ 2018–19లో రాష్ట్ర ప్రజల డేటా మొత్తాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థకు అమ్మేస్తే నోరేమైంది…ఆ ఊపుడేమైంది..? ఈ రంకెలేమయ్యాయి..?
ఈ రోజు వచ్చి డేటా చోరీ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.
ఆ ఎఫ్ఓఏ ఎవడో…ఆ క్రూడ్ కంపెనీలు ఎవరో నీకు చేతనైంది చేసుకో…
నువ్వు, చంద్రబాబుతో కలిసి కావాలంటే బీజేపీతో కూడా కలిసి ఆ డేటాపై నీకు చేతనైంది చేసుకో
మేం దమ్ముగా ఉన్నాం..మేం తప్పుడు పని చేయలేదు..ప్రజాసేవకు కంకణభద్దులమై ఉన్నాం.
హైదరాబాద్‌లో ఏదో తప్పుడు కంపెనీల గురించి, వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నావు కదా..నీకు చేతనైంది చేసుకో.
ఇంటర్నెట్లో నీ జనసేన సభ్యత్వం కావాలంటే మొంబర్ షిప్ ఎంట్రీ ఫాంలో దేశం, ఫోన్ నంబర్, ఈమెయిల్, ఓటర్ ఐడీ కావాలట..ఇది డేటా కాదా..?
ఈమెయిల్ ద్వారా డేటా అంతా తీయలేవా..? ఫోన్ నంబర్‌కి ఆధార్ లింక్ కదా..? ఆధార్ బయటకు రాదా..?
జనసేన డేటా అంతా నువ్వు ఎవడికిస్తున్నావ్…ఎక్కడ పెడుతున్నావ్..?
ఓటరు ఐడీ దేనికీ..? ఇది డేటా చౌర్యం కాదా..?
ఏం చదువుకున్నావో కావాలి…ఆడా మగా..లేక అటు ఇటు కాని వారా అనేది సేకరిస్తున్నావు కదా..ఇవన్నీ డేటా చౌర్యం కాదా..?
నేను, మోడీ, అమిత్ షా గోలీలు అడుకుంటాం..సాయంత్రం ఐస్‌క్రీంలు తింటామని చెప్తున్నావు కదా..
కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ తీస్తోంది..నీ కేంద్ర ప్రభుత్వం..నీ మోడీ…నీ అమిత్‌షా అడుగుతున్నది ఏంటో నీకు తెలుసా..?
ఆదాయం దగ్గర నుంచి అనేక వివరాలను కేంద్రం జనాభా లెక్కల కోసం తీసుకుంటోంది..?
ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ లెక్కలన్నీ కావాలి..?
మరి అమిత్‌షా, మోడీని కూడా అడుగు…మీరంతా చెవుల్లో గుసగుసలాడుకుంటారు కదా..? కేంద్రాన్ని అడగడానికి నీకు చేతకాదా..?
ఏ నిఘా సంస్థలతో విచారణ చేయిస్తావో చేయించు..:
ప్రజాసాధికారిక సర్వేతో మీరు డేటా చౌర్యం చేస్తే కేసీఆర్ మిమ్మల్ని బొక్కలో వేశాడు కదా..? అప్పుడు తెలియదా ఆ డేటా ఎక్కడికెళ్లిందో..?
మేం కలెక్ట్ చేసే డేటా సచివాలయంలోనే ఉంది..రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంది.
నువ్వు నిజంగా నిజాయితీ కలిగిన వాడివైతే…నీలో నిజంగా సరుకుంటే..నువ్వు చెప్పే మాట నిజమైతే నేను చాలెంజ్ చేస్తున్నా.
అమిత్‌షాకి నీకు, మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే సై…కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో విచారణ చేయిస్తావో…లేదా సీబీఐతో చేయించుకుంటావో చేయించుకో.
తప్పుడు మాటలు మాట్లాడి బురదేసి చంద్రబాబు కోసం బతుకుదామనే తప్పుడు ఆలోచనలు మానుకో.
ఈయన ముందొక సారి వెనుకొకసారి నేను అమిత్‌షాతో మాట్లాడాను..అన్నీ అమిత్‌షాతో చెప్పాను అంటాడు..మాట్లాడితే నీకు ఏంటి గొప్ప…?
మనదగ్గర సరుకులేనప్పుడు వారిని వీరిని చూపిస్తారు..
ఖలేజా ఉన్న వాడి మాటలు ఇవి కాదు..రా చూసుకుందాం అంటాడు.
అమిత్‌షాతో మాట్లాడితే ఎమవుతుంది…ఎవడికి ఊడుతుంది..?
మరి నేషనల్ యూత్ వాలెంటీర్ మాటేంటి..? వారినీ ప్రశ్నిస్తావా..?:
మానసిక పరిస్థితి ఆయనకు రెండు రకాలుగా ఉండే స్ప్లిట్ పర్సనాలిటీ.
వాలంటీర్లను ఓ పక్క తిడుతూనే వాలంటీర్లంటే నాకు ప్రాణం అంటాడు.
రోజుకు 164 రూపాయలు తీసుకునే వాడు వీడు వాలంటీరేంటి అంటాడు…
రెడ్‌క్రాస్ అంటాడు..వాలంటీర్ అంటే ఏంటి అంటూ రెండు లక్షల పుస్తకాలతో ప్రజలు చస్తున్నారు.
నెహ్రూ యువకేంద్ర సంఘటన్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ.
దాని కింద నేషనల్ యూత్ వాలంటీర్ అనే వ్యవస్థను కేంద్రం కూడా వాలంటీర్ సిస్టమ్‌ని మొదలుపెట్టింది.
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి చెప్పడం, కేంద్ర ప్రభుత్వ పథకాల దరఖాస్తులు చేసుకోవాలంటే వాలంటీర్లు వారి వద్ద వివరాలు తీసుకుని దరఖాస్తు చేయిస్తారు.
వీరికి బేసిక్ శాలరీ రూ.8,389 నుంచి రూ.9,387 ఇస్తారు..మరి మోడీ, అమిత్‌షాలు వీరిని వాలంటీర్లు అని ఎందుకు అంటున్నారు..?
రూ.164 రూపాయలు తీసుకునే వాడు వాలంటీర్ అనడానికి పనికి రాని వాడు రోజుకి రూ.260 రూపాయలు తీసుకునేవాడు దేనికి పనికొస్తాడు..వాలంటీర్ అనొచ్చా..?
దీన్ని మోడీకి చెప్పడానికి సరుకు లేదా..?
నేషనల్ యూత్ వాలంటీర్ అంటున్నాడు మోడీ ..ఇక్కడ మాట్లాడటం కాదు..అక్కడ మాట్లాడు.
కేసీఆర్‌కి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో మాట్లాడలేడు…ఢిల్లీలో మోడీ దగ్గర మాట్లాడలేడు.
అంత క్లోజ్ అయితే 8 ఏళ్లుగా పిలుపెందుకు లేదో..?:
మోడీ దగ్గర నాకు అపాయింట్మెంట్ లేదు…కేంద్ర ప్రభుత్వం నన్ను పిలవడం లేదని పిసుక్కుంటున్నావు.
విశాఖలో మోడీని కలిసి వచ్చిన తర్వాత 8 ఏళ్లు తర్వాత ఇప్పుడు నన్ను పిలిచారు అన్నావు కదా.
మీ ఇద్దరికి అంత జోరు ఉండి వాటేసుకుంటుంటే ఎనిమిదేళ్లు పిలుపెందుకు లేదు..?
అమిత్‌షాతో మాట్లాడేశాడట..ఇక జగన్ పని అయిపోయిందట..
జగన్ ది మంచి ప్రభుత్వం కాక, నువ్వు చెప్పే తప్పుడు మాటలే నిజమైతే ఈ నీతిఆయోగ్ నివేదిక ఏంటి..?
పవన్, బాబు కలిసి ఏలినప్పుడు 11.77 ఉన్నటువంటి పేదరికం శాతం..నేడు దాదాపు 5.1 శాతానికి దిగిపోయింది.
పేదరిక శాతం తగ్గిందని మేం చెప్పుకోవడం లేదు..మోడీ, అమిత్‌షా చెప్తున్నారు పవన్ కల్యాణ్. ఇది మీ మోడీ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్.
ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అంటాడు..ఓ పవన్ కల్యాణ్ నేను చాలెంజ్ చేస్తున్నా…
నువ్వు, చంద్రబాబు, బీజేపీ ముగ్గురు తలకిందులుగా తపస్సు చేసి జగన్ గారిని ఇంటికి పంపించలేరు.
నీకు చేతనైతే…దమ్ముంటే జైలుకు పంపిస్తానన్నావ్ కదా..పంపించు…
ఎదురుగా ఈలలు వేసే అమాయకులు ఉన్నారు కదా సినిమా డైలాగులు కొట్టడం కాదు.
కాసుకో..నీకు చేతనైంది చేయండి..జగన్‌ని ఆపగలిగితే ఆపండి 2024లో గెలవకుండా..
ప్రభుత్వాలు వద్ద ఉండాల్సిన డేటా ప్రైవేటు పరం చేసింది చంద్రబాబే.
రాష్ట్ర ప్రభుత్వ డేటా మొత్తం టీసీఎస్ వద్ద పెట్టి…ఎన్నికలు వచ్చినప్పుడు ఎవడికో అమ్మాడు.
కొనుగోలు చేసిన వాడిని కేసీఆర్ బొక్కలో వేయడం తెలియదా..?
డేటా దొంగ చంకలో కూర్చొని డేటా డేటా అంటున్నావ్ ..!:
పవన్ కల్యాణ్…నాకు కానీ, జగన్ కి కాని వ్యక్తిగతంగా నీమీద అసలు కోపమే లేదు.
వ్యక్తిగతంగా మనద్దరికీ ఆస్తి తగాదాలున్నాయా..? నీ పార్టీ ఆఫీసు పక్కన మాకేమన్నా స్థలం ఉందా..?
అమరావతిలో నీ పొలం దగ్గర నాకు కానీ, జగన్‌గారికి కానీ ఏమైనా పొలం ఉందా..?
నువ్వు ఎవరిదగ్గరైనా కొనుక్కో…నువ్వు కొనుక్కున్న పొలం వద్ద మనకి సరిహద్దు తగాదా ఏమైనా ఉందా..?
వెంకటేశ్వరస్వామి దేవాలయం యూనివర్సిటీ వద్ద నీ స్థలం పక్కనే మాకు స్థలాలు లేవు కదా…గట్టు తగాదాలు లేవు కదా..?
జగన్ కి, నాకు నీ మీద జాలి తప్ప కోపం ఎందుకుంటుంది..?
మా బాధల్లా చంద్రబాబు కోసం నువ్వు ఈ విధంగా దుర్మార్గంగా డేటా చౌర్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు.
ఎవడైతే డేటా చౌర్యం చేశాడో అతని చంకలో కూర్చుని డేటా చౌర్యం అనడం ఎక్కడి విడ్డూరం..?
డేటా డేటా అంటున్న నీ ఆధార్, ఓటు కార్డు..బ్యాంకు ఎకౌంట్లు ఎక్కడున్నాయి..ఇళ్లు ఎక్కడున్నాయి..?
నీ డేటా అంతా కేసీఆర్ వద్ద కదా ఉంది…ఈ ఆంధ్రప్రదేశ్‌కి ఏం సంబంధం..?
ఆల్ ఇండియా ట్రిప్‌కి వచ్చి ఈ అవాకులు చెవాకులు పేలడం దేనికీ..?
బలహీనుడెప్పుడూ కబుర్లు చెప్తుంటాడు…ప్రధాని, జాతీయ నాయకత్వంతో నాకుండే సత్సంబంధాలు చాలా బలమైనవి అంటాడు..ఎవడు అడిగాడు..
పాచిపోయిన లడ్లు అని తిట్టింది నువ్వు కాదా..? ఈ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చాలా ద్రోహం చేసింది అన్నది కూడా నువ్వే కదా..
రాజీనామాలు చేయండి అంటూ జగన్ ని మోడీపైకి ఉసిగొల్పింది ఎవరు..?
మళ్లీ మోడీ గొడుగు కింద చేరింది కూడా నువ్వే కదా…
ఎన్డీయే వచ్చేస్తే మాకేంటి..? కేంద్రంలో ఎన్డీయే రానివ్వండి.
అఖండ ప్రజలు కోరుకుంటే కచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలో ఉంటాం అంటాడు. ఇదేమన్నా అఖండ సినిమానా..?
రెండు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని…ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ కళ్లు మూసుకుని అబద్దాలు చెప్తున్నాడు.
జగన్ గారి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2.10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం.
మీరు వస్తానంటే రండి…రికార్డు అంతా చూపిస్తా..మెడికల్ అండ్ హెల్త్, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల్లో శాశ్విత ఉద్యోగాలు కాదా..?
50 వేల మందికి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చాం…
వాలంటీర్లది ఉద్యోగం కాదు..వారు చేసేది సేవ..వారికిచ్చేది గౌరవ వేతనం.
సేవకు తగ్గట్టుగా వారికి ఇచ్చేది కేవలం గౌరవ వేతనం మాత్రమే.
వారితో స్వచ్ఛందంగా సేవ చేయిస్తుంటే ఇలాంటి తప్పుడు మాట్లాడటం సరికాదు.
బీజేపీతో నీకు సత్సంబంధాలుంటే రాష్ట్రానికేం ఒరిగింది…?:
నీకు బీజేపీ పెద్దలతో చాలా సంబంధాలు ఉంటే ఎవడికి ఉపయోగం..?
నీకున్న బలమైన బంధంతో ఈ రాష్ట్రానికి ఏమి ఒరిగింది..?
నీవల్ల ఆవగింజంత లాభం ఏమన్నా జరిగిందా..?
ఒక్కరోజన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా..?
పవన్, చంద్రబాబు, బీజేపీ కలిసి ఐదేళ్లు ప్రభుత్వం నడిపారు. ఆనాడు లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు తీసుకురాలేకపోయారు.
ఎన్డీయేలో లేకుండా బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగకుండానే కేంద్రం నుంచి లోటు బడ్జెట్ కింద రూ.12వేల కోట్ల బకాయిలు వసూలు చేసుకుని వచ్చిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్. దీనికి మీరంతా సిగ్గుపడాలి.
జగన్ గురించి నేడు విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు కూడా సిగ్గుపడాలి.
రాష్ట్రం విడిపోయి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే..కేంద్రం రూ.16వేల కోట్లు ఇవ్వాల్సి వస్తే..మీరు ముగ్గురు కలిసి చచ్చీ చెడీ తెచ్చింది రూ.4వేల కోట్లు.
మీరు ముగ్గురు కలిసి కాపురం చేసి చెట్టాపట్టాలేసుకుని తిరిగినప్పుడే.
ఎన్నికల తర్వాత బలాబలాలను బట్టి ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాను అంటాడు.
అసలు ఈయన ఎన్ని సీట్లు తీసుకుంటాడో కూడా చూద్దాం కదా..
కనీసం నువ్వు 75 సీట్లన్నా తీసుకోకపోతే మరీ పరువు పోతోందని ఆ ముసలాయన ఉత్తరం రాశాడు.
చూద్దాం..నువ్వు ఏంటో..నువ్వు ఎన్ని సీట్లు పోటీ చేస్తావో..చూద్దాం.
ప్రజల్ని ఏమార్చి చంద్రబాబు పొట్లం కట్టి అప్పజెబుతున్నావన్న విషయం ఇప్పుడు అర్ధం కాకపోవచ్చు.
ప్రజలు బాగుండాలంటే జగన్ ప్రభుత్వమే రావాలి:
ప్రజలు బాగుండాలంటే జగన్ పరిపాలన తిరిగి రావాలి.
చదువనే ఆస్థి ద్వారా పేదరిక నిర్మూలన ఆయుధం ప్రజలకు మరింత చేరువ కావడానికి జగన్ ప్రభుత్వం మళ్లీ రావాలి.
శతృవుల నోటితో జగన్ గారి ప్రభుత్వం భేష్ అని సర్టిఫికెట్లు పొందిన ప్రభుత్వం మళ్లీ రావాలి.
జగన్ ప్రభుత్వం మళ్లీ రావాలంటే..బ్రోకర్లు పనిచేసే వారికి బైబై..
ప్రజల్ని మోసం చేసే వారికి రెండో సారి బైబై.
పొత్తులతోనే వెళ్తారని మేమూ చెప్తూనే ఉన్నాం కదా..ఈ పొత్తుల్లో ఎవరి పొత్తు ఎంత..?
అసలు అది నిజమైన పొత్తా..? డమ్మీ పొత్తా..?
ఇవన్నీ తెలిసిన రోజు జనం ఎవరికి పెళ్లి చేయాలో వారికి చేస్తారు.
చంద్రబాబు, పవన్ లు ఇద్దరూ గోబెల్స్ వారసులు.
తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని నమ్మించ వచ్చు అనుకునే వారు.
మీకు దమ్ముంటే ఆ ఎఫ్ఓఏ సంస్థను లోపలేయించండి..
మా డేటా మా దగ్గరే భద్రంగా ఉంది.
నువ్వు మోడీకి ఓటేయండి అన్నప్పుడు చిరంజీవి ఎక్కడున్నారు..? కేంద్రంలో మంత్రిగా లేరా..?
మా అన్న..మా కుటుంబం అంటున్నావు..2014లో అన్నయ్య పరువేమైంది..?
వేషాలకు అలవాటు పడినవాడు, వేషాలు వేసే వాడు…
నేను కేసులు కోసం కాదు రాష్ట్రాభివృద్ధి కోసమే కలిశాను అన్న పవన్…2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు.
నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో పవన్ కల్యాణ్ మాటల్లో నిజం అంతే ఉంటుంది.