Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి స్కీమ్ వెనుక ఓ స్కామ్

– చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుచేసేలా కేంద్రంతో మాట్లాడతాం
– చెత్తపైన పన్నేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి
-నర్సాపురంలో శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తాం
– యువనేత లోకేష్

వాటర్ సర్వీసు సెంటర్ వద్ద లోకేష్ మాటామంతీ
నర్సాపురం రూరల్ సరిపల్లిలో వాటర్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లిన యువనేత లోకేష్ నిర్వాహకుడితో కొద్దిసేపు మాట్లాడి ఆయన ఇబ్బందులు తెలుసుకున్నారు.
• ఈ సందర్భంగా సర్సీస్ సెంటర్ యజమాని బూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో కరెంటు బిల్లు రూ.1200 వచ్చేది, తాజాగా రూ.4998 రూపాయల బిల్లు వచ్చింది.
• ఇంత భారీగా కరెంటు బిల్లులు పెంచడం వల్ల మాకు మిగిలేదేమీ ఉండదు.
• గతంలో నెలకు రూ.25వేలు మిగిలేవి, ఇప్పుడు వ్యాపారం కూడా తగ్గడంతో ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది.
• విద్యుత్ బిల్లులు తగ్గిస్తే మాలాంటి వారికి వెసలుబాటుగా ఉంటుంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ముఖ్యమంత్రి జగన్ పేదల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నారు.
• వైసిపి అధికారంలోకి వచ్చాక 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.18వేల కోట్ల భారం మోపారు.
• జగన్ బాదుడుదెబ్బకు అన్నిరంగాలు కుదేలయ్యాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులపై సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం.
• చిరువ్యాపారులకు సబ్సిడీ రుణాలు, ఆర్థిక సాయం అందించి ఆదుకుంటాం.
• మరో 8నెలలు ఓపికపట్టండి, మీకోసం పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వస్తారు

నారా లోకేష్ ను కలిసిన భవన నిర్మాణ కార్మికులు
నర్సాపురం రూరల్ సరిపల్లి భవన నిర్మాణ కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో అందరూ నిర్మాణపనులపై ఆధారపడి జీవిస్తున్నాం.
• ఇసుక రేట్లు విపరీతంగా పెరగడం, అందుబాటులో లేకపోవడంతో మాకు నెలలో సగం రోజులు కూడా పనిదొరకడం లేదు.
• ప్రమాదాలు సంభవిస్తే భవనిర్మాణ సంక్షేమనిధి నుంచి మాకు ఎటువంటి సాయం అందడం లేదు.
• మా గ్రామంలో రోడ్లు, డ్రైనేజి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహం రాష్ట్రంలోని లక్షలాది మంది కార్మికులను రోడ్డుపడేసింది.
• ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఇసుక మాఫియా కారణంగా 40లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
• గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో రూ.40 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు.
• భవన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధి సొమ్ము 2వేల కోట్లను కూడా జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుక పాలసీ ద్వారా కార్మికులకు ఉపాధి కల్పిస్తాం.
• సరిపల్లి గ్రామంలో రోడ్లు, డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నర్సాపురం లాకుపేట వాసులు
నర్సాపురం 1వవార్డు లాకుపేట వాసులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు.
• నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకం కింద మాకు స్థలాలు మంజూరు చేయలేదు.
• మా వార్డుకు చెందిన వారిలో కొంతమందికి 10 కి.మీ దూరంలో సెంటు స్థలం ఇచ్చారు.
• మా ప్రాంతంలోనే మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
• మా వార్డులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది.
• మీరు అధికారలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ వెనుక ఓ స్కామ్ దాగి ఉంటోంది.
• పేదలకిచ్చే సెంటుపట్టాల పేరుతో జగన్ అండ్ కో రూ.7వేల కోట్లు కొట్టేసి, పనికిరాని స్థలాలను పేదలకు అంటగట్టారు.
• గత టిడిపి ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సకల సదుపాయాలతో 3.13లక్షల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే, చివరిదశలో ఉన్న ఆ ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక ఆవాసయోగ్యమైన ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• నర్సాపురంలో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

నారా లోకేష్ ను కలిసిన తూర్పుకాపులు
నరసాపురానికి చెందిన తూర్పు కాపులు నారా లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు.
• ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులు బీసీ-డి గుర్తిస్తున్నప్పటికీ ఓబీసీలుగా మమ్మల్ని కేంద్రం గుర్తించడం లేదు.
• 8 దశాబ్ధాల క్రితం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుండి వచ్చి ఉపాధి నిమత్తం స్థిరపడ్డాం..ప్రాంతం మారినా కులం మారలేదు.
• ఓబీసీ రిజర్వేషన్ వర్తించడం లేదు..వలసవచ్చి పనులు చేసుకుని వచ్చిన చాలీచాలని సంపాదనతో పిల్లలను చదివించుకుంటున్నాం.
• ఉద్యోగం కోసం అప్లై చేసుకోగా ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు.
• తూర్పుకాపులను బీసీ-డి కులమునకు సంబంధించి ఓబీసీలో చేర్చి మా సమస్యను పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• టిడిపి అధికారంలోకి వచ్చాక తూర్పుకాపుల కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, వారి ఆర్థిక స్వావలంబనకు కృషిచేస్తాం.
• తూర్పుకాపు బిడ్డల విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
• తూర్పుకాపులను ఒబిసిలుగా గుర్తించే అంశంపై కేంద్రానికి లేఖ సర్టిఫికెట్ల సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన చేనేతలు
నర్సాపురం జగన్నాథ ఆలయం సమీపంలో చేనేత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• చేనేతల కుటుంబసభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరుచేసి, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.
• చేనేత వస్త్రాలపై 5శాతం జిఎస్టీ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి.
• చేనేత సొసైటీలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలి.
• ఎన్టీఆర్ హయాంలో మాదిరి జనతా వస్త్రాల పంపిణీ చేపట్టి చేనేత వస్త్రాలను కొనుగోలుచేయాలి.
• నేతన్న నేస్తం కార్యక్రమాన్ని మగ్గం నేసే కార్మికులతోపాటు అనుబంధ చేత కార్మికులకు కూడా వర్తింపజేయాలి.
• చేనేత కార్మికులకు చంద్రన్న బీమా కల్పించి ఆదుకోవాలి.
• చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలి.
• నర్సాపురం వీవర్స్ కాలనీ 25వవార్డుకు సంబంధించి ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లస్థలాలకు పట్టాలు ఇప్పించాలి.
• గతంలో మాదిరి గాంధీ యువజన పథకం కింద 8వతరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇప్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
• జగన్ అధికారంలోకి వచ్చాక 60మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా, వారికి పరిహారం అందించకపోగా కనీసం పరామర్శించలేదు.
• టిడిపి హయాంలో చేనేత కార్మికులకు రూ.110కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నాం.
• చేనేత కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేసి సంక్షేమపథకాలన్నీ అందించేలా చర్యలు తీసుకుంటాం.
• చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుచేసేలా కేంద్రంతో మాట్లాడతాం, వీలుపడకపోతే రాష్ట్రమే జిఎస్టీ భరించేలా చేస్తాం.
• మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం.
• చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా పథకాలను వర్తింపజేస్తాం.
• 25వవార్డు ఎన్టీఆర్ కాలనీ వాసులకు పట్టాలు అందజేస్తాం.
• చేనేత కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు అందజేసేలా చర్యలు తీసుకుంటాం.
• ఇళ్లు లేని చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించడంతో పాటు కామన్ వర్క్ షెడ్లు నిర్మిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నర్సాపురం ప్రజలు
నర్సాపురంలోని 9వ వార్డులోని ప్రజలు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• మున్సిపాలిటీ ఏర్పడి 70 ఏళ్లు అయినా ప్రధానడంపింగ్ యార్డ్ సమస్య ఉంది.
• గత ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంలో ఏటిగట్టు సుందరీకరణలోభాంగా దశాబ్ధాలుగా పేరుకుపోయిన చెత్తచెదారంను పూడ్చగా, మిగిలిన పనులు ఈ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోలేదు.
• రైలింగ్, ఫుట్ పాత్ లను ధ్వంసం చేసేవారినుండి ప్రభుత్వం కాపాడలేకపోతోంది.
• మీరొచ్చాక పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలి.
• నీటి ఎద్దడికి టీడీపీ హయాంలో పైపు లైన్లు వేశారు..వాటినే వైసీపీ ప్రభుత్వం తవ్వి బయటకు తీసి మళ్లీ అమర్చారు తప్ప కొత్త నిర్మాణం చేయలేదు..నిధులు దుర్వినియోగం చేసి కూడా నీటి ఎద్దడి తీర్చలేకపోయారు.
• ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది.
• స్థానిక నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• చెత్తపైన పన్నేసిన చెత్త సీఎం జగన్ రెడ్డికి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై లేదు.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక నర్సాపురంలో శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తాం.
• గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం.
• వాటర్ గ్రిడ్ ద్వారా 24 గంటలపాటూ శుద్ధమైన నీటిని కుళాయి ద్వారా ఇంటింటికీ అందిస్తాం.
• నర్సాపురంలో పేరొందిన లేస్ పరిశ్రమకు రాయితీలిచ్చి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.

LEAVE A RESPONSE