Suryaa.co.in

Andhra Pradesh

పేదలు, పెత్తందారులు అంటూ జగన్నాటకం

-ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడుగుతున్నావ్‌…జగన్‌రెడ్డీ?
-పల్నాడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు
-బటన్‌ నొక్కిన డబ్బులో సగం కేంద్రం నిధులే
-రైల్వేజోన్‌, హోదా ఏమైంది?
-పింఛన్ల పంపిణీలో శవ రాజకీయాలు
-మాఫియా అడ్డాగా రూ.8 లక్షల కోట్లు లూఠీ చేశారు
-మిత్ర పక్షాల మధ్య చిచ్చుకు దుష్ప్రచారాలు
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం

ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడుగుతున్నావో పల్నాడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌నగర్‌లోని కన్నా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసలు ఏం అభివృద్ధి చేశావని పల్నాడు జిల్లాలో సిద్ధం సభలు పెట్టి తిరుగుతున్నావ్‌.. జగన్‌మోహన్‌రెడ్డి అని ఘాటుగా ప్రశ్నించారు. ఏ సంక్షేమ పథకాలు ఇచ్చావని పల్నాడు ప్రజలను ఓట్లు అడుగుతున్నావో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రూ.2.70 లక్షల కోట్ల డీబీటీలో సగానికి పైగా కేంద్రం నిధులే..
సంక్షేమ పథకాలకు జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నిధులలో అధిక భాగం కేంద్ర ప్రభు త్వం ఇచ్చినవే. ఉదాహరణకు 89 లక్షల రేషన్‌కార్డులకు సరుకులు కేంద్రం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 63 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తోంది. కరోనా సమయంలో పేదల కివ్వమని కేంద్రం పంపిన 5.65 లక్షల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం పేదలకు ఇవ్వ కుండా జగన్‌రెడ్డి బియ్యం మాఫియా తినేసింది. చంద్రబాబు ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా 8 రకాల సరుకులు సరఫరా చేయగా జగన్‌రెడ్డి బియ్యానికి పరిమితం చేసి పేదల ను మోసం చేశారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. రైతు భరోసాలో రాష్ట్ర వాటా రూ.7,500 మాత్రమే. కేంద్రం రూ.6 వేలు ఇస్తోంది. కానీ, రూ.13,500 తానే ఇస్తున్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

కేంద్ర పథకాలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం
కేంద్ర పథకమైన జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా నాటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా నారా లోకేష్‌ నిధులు తెచ్చి వందల కొద్దీ ట్యాంకర్ల ద్వారా తాగునీటి సమస్య లేకుండా చేశారు. జగన్‌ రెడ్డి రాష్ట్ర వాటా నిధులివ్వని కారణంగా జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులు విడుదల కాక నేడు రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. కేంద్ర పథకాలు 94 ఉండగా అందులో జగన్‌రెడ్డి 70 పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వనందున అవి నిరుపయోగమ య్యాయి. ఉదా కేంద్ర పథకమైన ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ వంటి కేంద్ర పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టి ఎస్సీ, ఎస్టీలకు ఇన్నోవా కార్లిచ్చాం. ఎన్‌బీసీఎఫ్‌డీసీ, ఎన్‌హెచ్‌డీబీ, ఎన్‌ఎఫ్‌డీబీ పథకాలతో ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించింది. కానీ, జగన్‌రెడ్డి ఈ పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ఇవ్వనందున రూ.40 వేల కోట్ల కేంద్ర నిధులు రాకుండాపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వయం ఉపాధి దూరమైందని విమర్శించారు.

`రైల్వే జోన్‌, హోదా ఏమైంది..
రైల్వే నిర్మాణాలకు రాష్ట్రం భూములు ఇవ్వనందున అభివృద్ధి కుంటుపడిరది. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు 52 ఎకరాలు ఇవ్వనందున అది కార్యరూపం దాల్చలేదని కేంద్రమే పార్లమెంటులో సమాధానం చెప్పింది. 31 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా అడగలేదు. తన అవినీతి కేసులు, అవినాష్‌రెడ్డితో చేయించిన వివేకా హత్య వల్ల కేంద్రం నుంచి ఏమీ అడగలేని పరిస్థితి ఏర్పడిరది. అభివృద్ధి చేసి సంపద సృష్టించే విధానం కాకుండా మితిమీరిన అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు.

జగన్‌ కన్నా చంద్రబాబే సంక్షేమం ఇచ్చారు
సంక్షేమ పథకాలకు రాష్ట్ర మొత్తం బడ్జెట్‌లో చంద్రబాబు 19 శాతం ఖర్చు చేయగా దాన్ని జగన్‌రెడ్డి ఖర్చు చేసింది కేవలం 15 శాతం మాత్రమే. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా జగన్‌ దాన్ని 9 లక్షల మందికి కుదించారు. సున్నా వడ్డీ క్రింద డ్వాక్రా మహిళలకు చంద్రబాబు రూ.5 లక్షల వరకు రుణం అందిస్తే జగన్‌ దాన్ని రూ.3 లక్షలకు కుదించారు. ఆ రూ.3 లక్షల వరకు వడ్డీ రాయితీ కేంద్రమే భరిస్తోంది.అన్న క్యాంటీన్లు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, విదేశీ విద్య లాంటి 100కి పైగా చంద్రన్న సంక్షేమ పథకాలు జగన్‌ రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ. లక్ష కోట్లు దారి మళ్లించారు. దాదాపు 14 లక్షల ఎకరాల అసైన్‌ మెంట్‌ భూములు కబ్జా చేశారు. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల అధనపు భారం మోపారు. నవరత్నాల్ని నవ మోసాలు చేసిన పేదల ద్రోహి జగన్‌ అని విమర్శించారు. ఈ ద్రోహాన్ని కప్పి పెట్టుకోవడానికి పేదలు.. పెత్తందార్లు అంటూ జగన్నా టకం ఆడుతున్నాడు. క్రూరమైన పెత్తందారుడు జగనేనని దుయ్యబట్టారు.

కావాలనే పింఛన్ల పంపిణీ జాప్యం…శవరాజకీయాలు
పింఛన్లకు నిధులు అట్టిపెట్టకుండా మార్చి 16-30 మధ్య రూ.13 వేల కోట్ల నిధులు తన సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు. పింఛన్లకు నిధుల కొరత పెట్టాడు. అవ్వా తాతలను ఎండల్లో తిప్పి అందులో ఎవరైనా చనిపోతే దాన్ని విపక్షాలకు అంటకట్టి శవ రాజకీయం చేసి, ఎన్నికల్లో లబ్ధిపొందాలని జగన్‌ రుట్ర చేశారు. నాడు ఎన్నికల్లో లబ్దికి బాబాయి వివేకాను చంపించి శవరాజకీయం చేశారు. కోడి కత్తి డ్రామాలాడి ఎన్నికల లబ్ధి పొంది రాష్ట్రాన్ని దోచుకున్నారు. నేడు జగన్‌ ధరల బాదుడు, ప్రభుత్వ నిధుల లూటీ, వివేకా హత్యలో తాడేపల్లి కుట్రల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పింఛన్ల పంపిణీపై కుట్ర చేశారు. సచివాలయం సిబ్బందిని ఉపయోగించుకొని ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ చేసి ఉండవచ్చు. ఖజానాలో నిధులుంటే ఏప్రిల్‌ 1వ తేదీనే పింఛన్లు ఇచ్చి ఉండొచ్చు. తన కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టడం వల్లే ఏప్రిల్‌ 1న పింఛన్లు ఇవ్వలేకపోయాడనేది నిజమని విమర్శించారు. ప్రతిపక్షాలు నిలదీసిన తర్వాత.. పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.

మద్యంలో లక్ష కోట్లు.. ఇసుకలో రూ.50 వేల కోట్లు లూఠీ
విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు చెడగొట్టాడు. అందులో 30 వేల మంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగల్యాలు మంటకలిపారు. ఇసుక మాఫియా వల్ల, భారతీ సిమెంట్‌ ధరలు పెంచడం వల్ల భవన నిర్మాణ రంగం దెబ్బతింది. దీనివల్ల 125 వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. 63 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాల ద్వారా జగన్‌ కుటుంబం రూ.8 లక్షల కోట్లు లూఠీ చేసింది.

మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టే దుష్ప్రచారాలు
జగన్‌ దోపిడీ, హత్యా రాజకీయాలు, ప్రజలపై వైసీపీ మాఫియా దాడుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఓట్లు చీలకూడదని మిత్రపక్షాలు భావించాయి. ఊళ్లో దొంగలు పడ్డా, హంతకులు రెచ్చిపోయినా ఊరంతా ఒక్కటై వారి భరతం పడతారు. అలాగే నేడు రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు మిత్ర పక్షాలు ఒక్కటయ్యాయి. దీంతో తన దోపిడీకి అడ్డుకట్ట పడబోతోందని జగన్‌ భయపడుతున్నాడు. అందుకే మిత్ర పక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు రకరకాల దుష్ప్రచారాలు, రెచ్చగొట్టే రాతలు నీలి మీడియాలో రాయిస్తు న్నాడు. జగన్‌రెడ్డి ఉచ్చులో చిక్కుకోవడానికి మిత్రపక్షాలు, ప్రజలు సిద్ధంగా లేరు. జగన్‌ దోపిడీ పాలనను అంతమొందిస్తారు.

దోపిడీ పాలనను కూలదోస్తాం.. సూపర్‌ 6 అమలు చేస్తాం
1. రూ.3 వేలు నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
2. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
2. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
3. ప్రతి రైతుకు అన్నదాత పథకంతో ఏటా రూ.20 వేలు
4. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలెండర్లు
5. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1500
6. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

బీసీ డిక్లరేషన్‌
1. 50 సంవత్సరాలకే పెన్షన్‌ అమలు
2. ప్రత్యేక రక్షణ చట్టం
3. బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా 5 ఏళ్లల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు
4. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరిస్తాం
5. అన్ని నామినేటెడ్‌ పదవుల్లోనూ 34 శాం పదవులు బీసీలకిస్తాం.
6. ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.
7. చట్టబద్ధంగా కుల గణన చేస్తాం
8. రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ
9. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు
10. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేత

చారిత్రక ఎన్నికలు.. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఆవశ్యం
జగన్‌ కుటుంబ దోపిడీ వల్ల, మితిమీరిన అప్పుల వల్ల రాష్ట్రం దివాళా తీసింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడిరది.
సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమం పెంచాలంటే జగన్‌ దుష్ప్రచారాల్ని, కుట్రలను తిప్పికొట్టాలి. వైసీపీ ఉచ్చులో చిక్కుకోరాదు.

మెగా డీఎస్సీపై చంద్రన్న తొలి సంతకం
కేంద్ర పథకాల ద్వారా నిధులు పంచడానికి, పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు అవసరం. మోదీజీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు జగన్‌ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటు చారిత్రక అవసర మని పిలుపునిచ్చారు. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యెల్లినేడి రామస్వామి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవనారాయణ, బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ కట్టా శంకర రావు, పట్టణ బీజేపీ ప్రెసిడెంట్‌ కందకట్ల శంకరరావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE