Suryaa.co.in

Telangana

పేదల భూములతో రియల్ వ్యాపారం

-కేసీఆర్ కేటీఆర్ కవిత ఫామ్ హౌస్ లను పేదల పరం చేస్తాం
-లిడ్ క్యాబ్ భూముల పరిరక్షణ సదస్సు లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ బీఎస్.పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మాదిగ చర్మకారుల లెదర్ పరిశ్రమల భూముల దళిత అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పూసపాటి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో మా భూములు మాకేనని పేరుతో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్ లు హాజరై మాట్లాడారు. ‌ తెలంగాణలో సుమారు 2000 ఎకరాల లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చర్మకారులకు సంబంధించిన భూములను సీఎం కెసిఆర్ దొడ్డి దారిన గుంజుకొని స్వాధీనం చేసుకొని వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

వట్టినాగులపల్లి, బుద్వేల్, సిద్దిపేట, సూర్యాపేట తదితర ప్రాంతాలలో ఇదే తరహా వ్యాపారం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. గజ్వేల్ లోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం తో పాటు జన్వాడలోని కేటీఆర్ ఫామ్హౌస్, మేడ్చెల్ లోని కవితా ఫామ్ అవుతున్న సైతం తీసుకొని తిరిగి పేదలకు పంచుతామని అన్నారు.
లిడ్ క్యాప్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం సాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే రైల్వే స్టేషన్లో బస్టాండ్లు ఎమ్మార్వో ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల వద్ద బూట్ పాలిష్ కార్యక్రమాలు నిర్వహిస్తామని దళిత అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కూసపాటి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.

LEAVE A RESPONSE