-బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు
-బిజెపిని ప్రజలు ఆశీర్వదించారు
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
విజయవాడ ..మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబురాన్ని అంటాయి. బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంచుకున్న బీజేపీ శ్రేణులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించి స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి విజయోత్సవ వేడుకల్లో పాల్గొని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి శ్రేణుల్లొ ఉత్సాహాన్ని నింపారు
ఈ సందర్భంగా మీడియాతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ ఈరోజు చారిత్రాత్మకమైన రోజు గా అభివర్ణించారు. ఎన్నికల కమిషన్ కు అభినందనలు తెలుపుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారన్నారు.చిన్న సమస్య కూడా లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల వేళ డబ్బు,వివిధ తాయిలాల రూపంలో పట్టుకున్న సొత్తు విలువ 1760 కోట్లు ఉండగా 1760 కోట్లలో 660 కోట్లు తెలంగాణలోనివే అని వివరించారు.
ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారన్నారు బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారు. రాజస్థాన్ ఎన్నికల్లో 42 % ఓటు శాతం బీజేపీ సాధించింది.మధ్యప్రదేశ్ లో 160 సీట్లతో 49% ఓటు షేర్ బీజేపీ సాధించింది.చత్తీస్ ఘడ్ లో 46% ఓటు షేర్ బీజేపీ సాధించింది . తెలంగాణలోనూ మేం అద్భుతమైన విజయం సాధించామనే భావిస్తున్నాం .కామారెడ్డిలో మా అభ్యర్ధి వెంకటరమణారెడ్డి కేసీఆర్,రేవంత్ రెడ్డిని ఓడించి గెలిచారు.
మద్యప్రదేశ్ లో ప్రజలు సుపరిపాలనకు ఓటేశారు. చత్తీస్ ఘడ్, రాజస్ధాన్ లో అవినీతి కి వ్యతిరేకంగా ఓటేశారు. తెలంగాణాలో బిజెపి గణనీయయమైన ఓటింగ్ జరిగింది, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఎన్నికలలో బిజెపి శ్రేణులు రాత్రింబవళ్లు కష్టపడి పార్టీకి అండగా ఉండి విజయాన్ని అందించారని బిజెపి శ్రేణులు, కార్యకర్తలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రశివన్నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి మీడియా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, రాష్ట్ర అధికారప్రతినిధి సాధినేని యామినీ శర్మ, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బిజెపి నేతలు మువ్వల వెంకటసుబ్బయ్య, బబ్బూరి శ్రీరాం, పీయూష్, శ్రీధర్, రత్నకుమారి, గణేష్, పిట్టల గోవింద్, నూతల పాటి బాల, పొట్టి శ్రీహరి, రత్నకుమారి, స్వాతి, రామాంజనేయులు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.