Suryaa.co.in

Telangana

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ

-ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌
-జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బిఎం సంతోష్
-సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి బదిలీ

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా అహ్మద్‌ నదీమ్‌, సాగునీటి శాఖ క్యాదర్శిగా రాహుల్‌ బొజ్జా బదిలీ చేసింది. మొన్నటి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా నియమించింది.

ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా అహ్మద్‌ నదీమ్‌, సాగునీటి శాఖ క్యాదర్శిగా రాహుల్‌ బొజ్జా బదిలీ చేసింది. మొన్నటి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా నియమించింది.

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌, ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ బాధ్యతలను డీ దివ్యకు అప్పగించింది. నల్గొండ కలెక్టర్‌గా హరిచందన దాసరిని బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న భారతీ హొళికెరికి ఆర్కియాలజీ బాధ్యతలను అప్పగించింది.

రంగారెడ్డి కలెక్టర్‌గా కే శశాంక, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్‌ను బదిలీ చేసింది. టీఎస్‌ డైరీ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఫెడరేషన్‌ ఎండీగా చిట్టెం లక్ష్మి, కార్మికశాఖ డైరెక్టర్‌గా క్రిష్ణ ఆదిత్య, మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ను నియమించింది.

సీఎంవో కార్యాలయ జాయింట్‌ సెక్రెటరీగా సంగీత సత్యనారాయణ, సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి, జోగులాంబ కలెక్టర్‌గా బీఎం సంతోష్‌, హైదరాబాద్‌ స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా కధీరవన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బీ వెంకటేశం, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధా ప్రకాశ్‌, ఆయూష్‌ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి, ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ ముఖ్య కార్యదర్శిగా డీ కృష్ణ భాస్కర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఆర్‌వీ కర్ణన్‌, జీఏడీ కార్యదర్శిగా రఘునందన్‌రావు, పంచాయతీ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

LEAVE A RESPONSE