Suryaa.co.in

Andhra Pradesh

జగన్ మాటలన్నీ నీటి మూటలే

గుంటూరు : “జగన్ మాటలన్నీ నీటిమూటలే” నని జాబ్ క్యాలెండర్,మెగా డిఎస్సి,ఖాళీ పోస్టులు భర్తీ,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన పైన నీటి మూటల వంటి మాటలు కట్టిపెట్టాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ వినూత్న రీతిలో నిరసన తెలిపి ఎండగట్టారు.

జాబ్ క్యాలెండర్,మెగా డిఎస్సి,ఖాళీ పోస్టులు భర్తీ,యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన పైన ముఖ్యమంత్రి “జగన్ మాటలన్నీ నీటి మూటలే” అని కళ్ళకు కట్టినట్లు చూపుతూ 2.30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి భర్తీ చేయకుండా నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ ను దేశంలో నెంబర్ వన్ స్థానంలో వైకాపా హయాంలో ముఖ్యమంత్రి జగన్ నిలిపారని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో శనివారం గుంటూరులోని లాడ్జి సెంటర్లో జగన్ మాటలన్నీ నీటిమూటలే అని వ్రాసియున్న నీటిమూటలను తలపైన పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం జగన్ మీ నీటి మూటల లాంటి మాటలు మాకు వద్దు అంటూ 2024 లో యువజన విద్యార్థి లోకం ఇంటికి పంపేందుకు సిద్ధం అయ్యిందని జగన్ మాటలు అయిన నీటి ముఠాలను తిరిగి ఇచ్చేస్తున్నామని లాడ్జి పగలగొట్టారు. సి ఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు.

జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ .. CMIE నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 నాటికి 4.0 శాతం ఉన్న నిరుద్యోగిత శాతం డిసెంబర్ 2023 నాటికీ 6.6 శాతానికి పెరిగింది.
CMIE నివేదిక ప్రకారం నిరుద్యోగ రేటు జాతీయ స్థాయిలో 17.23 శాతం ఉంటె రాష్ట్రంలో 35.14 శాతం ఎక్కువ అంటే రెండింతలు ఎపి లో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. అంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్లో 73 శాతం పట్టభద్రులే ఉన్నారు,
ఉపాధి ఉద్యోగ అవకాలు లేక గత మూడు నాలుగేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి చెప్పారు.
మరో వైపు 2021లో కేవలం గంజాయి,మత్తు పదార్దాలకు బానిసలై ఏపీలో 571 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతుంది.

తెలుగుదేశం 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని నాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ గడచిన నాలుగున్నరేళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

కమిషన్లకు కక్కుర్తి పడి నాలుగేళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారు.
అమరావతి నిర్మాణంతో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు శ్రీకారం చుడితే జగన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేశారు.తెలుగుదేశం హయాంలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 17591 ఉద్యోగాలిస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి అన్న ముఖ్యమంత్రి జగన్ ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు.

మరోపక్క ఐటి అభివృద్ధితో 24 వేల ఉద్యోగాలు ,స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2.50 లక్షల మందికి శిక్షణ ఇచ్చి 80 వేలకు పైగా ఉద్యోగాలిస్తే అధికారంలోకి రాగానే ఐటి కంపెనీలను తరిమేసి అక్రమ కేసులతో స్కిల్ డెవలప్మెంట్ ని నిర్వీర్యం చేశారు.నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పనులలో కాంట్రాక్టులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు ఎంతమందిని కాంట్రాక్టర్లుగా తయారు చేశారు.

రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ ..
ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ, బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొట్టారు.25 మంది ఎంపిలనిస్తే కేంద్రం మెడలు వంచి సాదిస్తామన్న ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు.ఉద్యోగాలు ఉపాధి లేక రాష్ట్రంలో యువత గంజాయి డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలయ్యి విలువైన జీవితాలని పాడుచేసుకుంటున్నారు.జగన్ పాలనలో గంజాయి అక్రమ రవాణాలో ఎపి నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎన్సీబీ నివేదిక చెబుతుంది.

వీటన్నిటికీ కారణం జగన్ రెడ్డి అసమర్థత, చేతకాని పాలనే. ఇకనైనా ఎపి యువతను మోసం చేయటం మాని వెంటనే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి , రాష్ట్రంలో ఖాళి పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు, జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్,జిల్లా అధికార ప్రతినిధులు సింగు గోపి,షేక్ షుకూర్, కార్యనిర్వాహక కార్యదర్సులు మన్నెం శ్రీనివాస్, కార్యదర్సులు వేమా విజయ్ కాంత్,పఠాన్ అథావుల్లా ఖాన్, మాచవరపు దాసు, గుంటూరు పశ్చిమ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్,కార్య నిర్వాహక కార్యదర్శి కోలా మల్లికార్జున రావు, గుంటూరు తూర్పు ఉపాధ్యక్షులు వేముల కిరీటి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రాంబాబు, 47 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు దాది గోపాల్, తెలుగుదేశం నాయకులు అబ్దుల్ రజాక్, కొల్లా నాగ సుబ్బారావు,షేక్ సుభాని,ప్రసాద్,ఉస్మాన్,తెలుగుయువత నాయకులు శేషాద్రి సాంబశివరావు,శొంఠినేని అనిల్,చిక్కాల శివరామ కృష్ణ,సన్నపు ఆదిత్య రెడ్డి,బుల్లా కుమార్ బాబు,చింతా వినోద్ ,గాలి ఉపెంద్ర తథితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE