-మాజీ మంత్రి శనక్కాయల అరుణ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజెపి విజయ సంకల్పయాత్రకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శనక్కాయల అరుణ విచ్చేశారు ఈరోజు నాలుగోవ రోజు మల్లికార్జున పేట శివాలయం వద్ద నుండి ప్రారంభమై పొట్టి శ్రీరాములు నగర్, అరండల్ పేట 10వలైను వరకు సాగింది.
మాజీ మంత్రి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శనక్కాయల మాట్లాడుతూ వల్లూరు జయప్రకాష్ నారాయణ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఈరాష్ట్రానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి మాట తప్పను మడమ తిప్పును అని అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అభివృద్ధిని ఆమడ దూరంలో నెట్టారని రాబోయే ఎన్నికలలో వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికై ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేటాయింపులు చేపట్టారని ముఖ్యంగా మహిళల కోసం విపత్కర, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళల కోసం రాష్ట్రంలో 200 ఉజ్వల గృహాలు 21 స్వధార్ గృహాలు ఏర్పాటు. యుక్త వయసులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. రాష్ట్రంలోని గర్భిణీ లు బాలింతలు పసిపిల్లల సంరక్షణ కోసం గత మూడు సంవత్సరాల్లో అంగన్వాడీ కేంద్రాలకు, అనుబంధ పోషకాహార కార్యక్రమం కోసం సుమారు 2000 కోట్లు మంజూరు చేశారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలో ఐదు లక్షల పన్నెండు వేల నాలుగువందల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం కింద రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య సుమారు 15లక్షల మంది పైచిలుకే ఉన్నారని తెలిపారు..
వెస్ట్ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ…
విజయ సంకల్ప యాత్ర పేరుతో ప్రజలతో మమేకమవుతూ సమస్యలను ఆడిగి తెలుసుకుంటున్నాము. నగరంలో ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో పాలక ప్రభుత్వం ఉండటం గమనార్హం.రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త, మురుగు పేరుకోని పోయి ఉండటం చూస్తే చెత్తను తీయించలేని చెత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. చెత్తమీద పన్నువేసిన ముఖ్యమంత్రి చెత్తను తీయించలేకపోవడం చూస్తే రాష్ట్రం ఎంత అధోగతి పాలయ్యింది అర్ధమవుతుంది. పరిపాలన చేయడంలో ఆసక్తి చూపని ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రకృతి సహజంగా సంపదలను దోచుకోవడంలో మాత్రం ముందున్నారని దుయ్యబట్టారు.
ఈకార్యక్రమంలో నాలుగో మండల ప్రధాన కార్యదర్శి పెద్దింటి కృష్ణ చైతన్య, జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రి సుగుణ, కార్యదర్శి రమాదేవి, శ్రీకల్యాణి, బజరంగ్ రామకృష్ణ, నరేంద్రషా, మండల నాయకులు మందలపు సురేష్, రత్నాకరం, కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు దారా అంబేద్కర్, చింతపల్లి వెంకట్, కేశంశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, పాలపాటి రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్సులు కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, ఆవుల రాము, చంద్రశేఖర్ గుప్తా, తోట శ్రీనివాసరావు, కత్తి మేరీ సరోజిని, ఏలూరి లక్ష్మి, దుర్గాభవాని, నాగమల్లేశ్వరి, రేణుకాదేవి, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, రాచుమల్లు భాస్కర్, ఏడుకొండలు గౌడ్, కారంశెట్టి సత్యం, ప్రకాశరావు, యమ్మాజీ హనుమంతరావు, దేసు సత్యనారాయణ, అంకాల శ్రీను, తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.