అధికార వైసిపి ఎమ్మెల్యే బొల్లా కు షాకిచ్చిన సొంత మండలం ఓటర్లు

-విజయోత్సవాలను జరుపుకుంటున్న టిడిపి శ్రేణులు..
వినుకొండ : శావల్యాపురం లో తిరిగి తెలుగుదేశం జెండా రెపరెపలాడింది.. జడ్పిటిసి బై పోల్లో ఘన విజయం సాధించారు. టిడిపి అభ్యర్థి స్వర్గీయ పార హైమ రావు సతీమణి పారా హైమావతి 1046 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
సమీప వైసీపీ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత చుండూరి వెంకటేశ్వర్లు పై విజయం అధికార పార్టీకి చెంపపెట్టు గా మారింది. రసవత్తరంగా సాగిన పోటీలో టిడిపి ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ముఖ్యంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సొంత మండలం కాకపోవడం ఆ మండలం లోని ఓటర్లు పెద్ద షాక్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.
టిడిపి అభ్యర్థి హైమావతి సొంత గ్రామం వేల్పూరు, అదే గ్రామం బొల్లా బ్రహ్మనాయుడు కావడం విశేషం. ఆ గ్రామంలోనూ మండలంలోనూ హైమావతి ఆదరణ తిరుగు లేకుండా సాగింది. మూడు రౌండ్లు గా మొదలైన కౌంటింగ్ లో కేవలం రెండో రౌండ్లో మాత్రమే పది ఓట్లు వైసీపీ ఆదిక్యత సాధించగా 1వ రౌండు టిడిపి 731, మూడో రౌండ్లో టిడిపి 313 ఓట్లు సాధించి ఘన విజయం పొందడం ఆ పార్టీ శ్రేణులలో ఆనందానికి అవధులు లేవు. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పోలింగ్,కౌంటింగ్ ముగిసేవరకు ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేశాయి.
హైమావతి + చుండూరి మధ్య పోటీ లాగా సాగలేదు ఎమ్మెల్యే బొల్లా x మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య పోటీలా సాగింది. వీరిద్దరి మధ్య ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం సవాళ్లు ప్రతిసవాళ్లు తో హోరాహోరీగా సాగిన ఈ పోటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగలడం ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ మిగిల్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మనిద్దరి మధ్య పోటీ గా సవాలు విసురుతున్న విషయం తెలిసిందే ఈ ఫలితాలు అధికార పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి. ఏకపక్షంగా ఓటర్లు టిడిపి వైపు మొగ్గు చూపి హైమావతి ఘన విజయాన్ని ఇచ్చారు.విజయ దుందుభి మోగించిన తెలుగుదేశం శ్రేణులు జీవి ఆంజనేయులు తో తన నివాసం వద్ద సంబరాలు జరుపుతున్నారు.
షాక్ తిన్న అధికార పార్టీ నేతలు కనిపించకుండా పోయారు.
ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి, అక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు.రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కరువైందని అందుకే ప్రజలు తిరిగి టిడిపి వైపు చూశారని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వినుకొండ నియోజకవర్గంలో తిరిగి తెలుగుదేశం జెండా ఎగురుతుంది అని శావల్యాపురం జెడ్పిటిసి ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు.
హైమావతి విజయానికి కృషిచేసిన గ్రామ స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు, నియోజకవర్గ స్థాయి నేతలకు జీవీ ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారానికి విచ్చేసి సహకరించిన జిల్లా టిడిపి నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమేనని ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ ఆగడాలపై టిడిపి యుద్ధం ప్రారంభమైందని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.

Leave a Reply