Suryaa.co.in

Andhra Pradesh

అద్దేపల్లి ట్రస్టు ద్వారా పేదలకు సేవలు అందించడం అభినందనీయం

– పురుషోత్తంకు పుట్టినరోజు శుభాకాంక్షలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 23: తన తండ్రి అద్దేపల్లి పాపారావు జ్ఞాపకార్థం గుడివాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు అద్దేపల్లి పురుషోత్తం చారిటబుల్ ట్రస్ట్ ను నెలకొల్పి గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని కవిరాజ కళామందిరం సమీపంలో వున్న యూనియన్ కార్యాలయంలో పురుషోత్తం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కొడాలి నాని సమక్షంలో పురుషోత్తం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని కేకును తినిపించి పురుషోత్తంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, సామాజిక సేవ లక్ష్యంగా పని చేస్తున్న పురుషోత్తం మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని అన్నారు. సమాజంలో ఉన్నత స్థానాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకున్నారు. పురుషోత్తం, ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేవుడు ఆశీర్వాదాలను ఇవ్వాలని అన్నారు. అద్దేపల్లి కుటుంబంతో తనకు చిన్ననాటి నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పురుషోత్తం తండ్రి దివంగత పాపారావు జర్నలిస్టుగా పని చేశారని, ఆయన మరణం తర్వాత అద్దేపల్లి పాపారావు చారిటబుల్ ట్రస్టును నెలకొల్పి పేదల కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మాట్లాడుతూ అద్దేపల్లి పురుషోత్తం తన పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా కార్మికుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏ కార్యక్రమం నిర్వహించినా మంత్రి కొడాలి నాని, తన సమక్షంలో జరుపుకుంటాడని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని విజయానికి పురుషోత్తం, ఆయన అభిమానులు కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పురుషోత్తంలను గజమాలతో సత్కరించారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్మికులందరికీ భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోయ రాజేష్, అద్దేపల్లి హరి హర ప్రసాద్, యూనియన్ అధ్యక్షుడు గుళ్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి ధనాల బుజ్జి, నాయకులు కగ్గా దుర్గారావు, వంపుగడ్డ ఆనంద్, గండికోట ఆంజనేయులు, చోరగుడి రాజేష్, ముత్యాల రాజేష్, రౌతు కేశవర్ధన్, జి నారాయణ, రెడ్డి అంకాలు, కస్తూరి కిరణ్, కాకి దుర్గా లక్ష్మణరావు, వడ్డాది బాలాజీ, వడ్డాది సుబ్రహ్మణ్యం, బత్తుల పార్వతి, బత్తుల రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE