ఇంకా ఏమైనా మిగిలాయేమో వెదుక్కో జగన్!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చి పీక్ స్టేజికి చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాటవరం మరుగుదొడ్ల వద్ద కూడా జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల అని ఫ్లెక్సీ పెట్టారట. చెప్పుకోవడానికి 4.9ఏళ్లలో చేసిందేమీ లేకపోవడంతో చివరకు పాయిఖానాల వద్ద కూడా ఇలా బోర్డులు ఏర్పాటుచేసే దుస్థితికి చేరుకున్నారు. అసమర్థ సిఎం పాలనలో ఉద్యోగాల్లేక రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గంటూ చివరకు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు కిందకు దిగుతున్న ఇటువంటి పాలకుడ్ని ఏమనాలో మీరైనా చెప్పండి ప్లీజ్…!

Leave a Reply