నారా లోకేష్ పిలుపు.. మంగళగిరి వైసీపీలో కుదుపు

– వైసీపీ నేతలు అందె వెంకట ప్రసాద్, పల్నాటి నాగేశ్వరరావుతోపాటు 100 కుటుంబాలు టిడిపిలో చేరిక
-గత కొన్నిరోజులుగా కీలక వైసీపీ నేతలంతా టిడిపిలో చేరుతుండడంతో మంగళగిరి వైసీపీ ఖాళీ
-వైసీపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా..కదలిరా..అంటూ వైసీపీ నేతలంతా టిడిపిలో చేరేందుకు క్యూ కడుతున్నారు. జగన్ పని అయిపోయింది, వైసీపీ దారుణ పరాజయం ఖాయం అని తేలడంతో కీలక వైసీపీ నేతలంతా టిడిపిలో చేరుతున్నారు. ముఖ్య వైసీపీ నాయకులు పార్టీని వీడటంతో మంగళగిరి వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది.

ఉండవల్లి నివాసంలో శనివారం మంగళగిరికి చెందిన వైసీపీ నేతలైన ప్రముఖ వ్యాపారవేత్త అందె వెంకట ప్రసాద్, కాజ పిఎసిఎస్ మాజీ చైర్మన్ పల్నాటి నాగేశ్వరరావులతోపాటు మరో 100 కుటుంబాలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైసీపీ నాయకులు టిడిపిలో చేరారు. వీరందరినీ నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీలో అన్నివర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని, ఇప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న నేతలను కలుపుకొని రాబోయే రోజుల్లో టిడిపి విజయానికి కృషిచేయాలని కోరారు. అంతకు ముందు మంగళగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం జెండాలు కట్టిన కార్లు, బైకులతో ప్రదర్శనగా బయలుదేరి వచ్చారు.

యువగళం పాదయాత్రతో నవ్యాంధ్రకి నవశకం లిఖించిన నారా లోకేష్, మంగళగిరిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తటస్థ ప్రముఖులతో భేటీ అవుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. యువగళంతో సృష్టించిన ప్రభంజనంతో లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు వివిధరంగాల ప్రముఖులు, వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, నియోజకవర్గం పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ రావు, మంగళగిరి రూరల్ మండలం అధ్యక్షుడు తోట పార్థసారథి, మండల ఉపాధ్యక్షుడు కొమ్మా సుకుమార్, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రంగిసెట్టి నరేంద్ర ( బాబి ), కాజా గ్రామ పార్టీ అధ్యక్షుడు పళ్ళబోతుల శ్రీనివాస రావు, ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటి వెంకట్రావు, కాజా గ్రామ ప్రధాన కార్యదర్శి నంబూరు సాల్మన్ రవి, డాక్టర్ మునగపాటి వెంకటేశ్వర రావు, గండికోట విర్రాఘవులు, విన్నకోట శ్రీనివాస రావు, తాత కోటయ్య, తోట సాంబశివరావు, సుంకర రఘుపతి, గాదె లక్ష్మా రెడ్డి, ఉయ్యూరు సాంబి రెడ్డి, రామకృష్ణా రెడ్డి, లెనిన్ రెడ్డి, దానబోయిన రామరాజు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply