Suryaa.co.in

Andhra Pradesh

11డిమాండ్స్ లో 9 నుంచి 10సమస్యల పరిష్కారానికి అంగీకరించాం

– అంగన్ వాడీలకు చేతులు ఎత్తి దండం పెట్టి కోరాం
-ఎన్నికలు అయ్యాక పరిశీలిస్తాం అంటే లేదు ఇప్పుడే అంటున్నారు
– అంగన్ వాడీలపై ఎస్మా ప్రమోగించడానికి గల కారణాలను పేర్కొన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

అంగన్ వాడీలకు చేతులు ఎత్తి దండం పెట్టి కోరాం, వారి కోరిన 11డిమాండ్స్ లో 9 నుంచి 10సమస్యల పరిష్కారానికి అంగీకరించాం.. ఒకటో, రెండో భారం అవుతాయి.ఎన్నికలు అయ్యాక పరిశీలిస్తాం అంటే లేదు ఇప్పుడే అంటున్నారు.. ఎమెర్జెన్సీ సేవల కింద గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఇప్పుడు పోషణ సరుకులు అందించాలి.అందుకే ఎస్మా తీసుకుని వచ్చాము. మేనిఫెస్టోలో చెప్పిన్నట్లు రాగానే జీతాలు పెంచాము. తెలంగాణతో సరి సమానం చేయమన్నారు . ఇప్పుడు అంత బడ్జెట్ లేదు. ఎన్నికలు అయ్యాక చూద్దాం అన్నాము. మిగతా అన్ని ఒప్పుకున్నాము. దానికి కూడా వీళ్ళు సమ్మె విరమించకపోతే మేం ఇంకేం చేయాలి ? గత 25 రోజుల నుండి గర్భిణీలు,బాలింతలను,చిన్న పిల్లలను సమ్మె పేరుతో అంగన్వాడీలు ఇబ్బందులు గురి చేస్తుంటే..ప్రభుత్వం ఎంత కాలం చూస్తూ ఉంటుంది? ఎసెన్షియల్ సర్వీసెస్ ఆక్ట్ ప్రయోగించాం . ఆ విషయం లో మేము ఏమీ చంద్రబాబు నాయుడు లాగా గుర్రాల తో మేము తొక్కించలేదు కదా?

LEAVE A RESPONSE