దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారం ‘‘పద్మవిభూషణ్’’ పొందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టిడిపి వ్యవహారాల ఇన్ ఛార్జి , మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం ఆయన నివాసానికెళ్లి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.. వెంకయ్యనాయుడికి దక్కిన ఈ అరుదైన గౌరవం ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంగా కంభంపాటి పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘం నాయకుడు, ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం అసమాన్యం అన్నారు.. ఎంపీగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య నాయుడు సేవలను ప్రస్తుతించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా గ్రామాల్లో, పట్టణాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పాటుబడ్డారని కొనియాడారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయంలో రాష్ట్రపతి మినహా అనేక హోదాల్లో పనిచేసిన వెంకయ్యనాయుడు సమకాలీన రాజకీయ నేతలకు స్ఫూర్తిప్రదాత అన్నారు.