Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాపోరు పేరుతో యాత్ర

– ఈనెల 27న ఏలూరులో ప్రజా పోరు పేరుతో బిజెపి బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తల సమావేశం
– ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్న బిజెపి నేతలు
స్టేడియం గ్రౌండ్ ని పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఇతర నేతలు

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏమన్నారంటే… పొత్తుల విషయం ఎలా ఉన్నా భాజపా కార్యకర్తలు అందరూ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజాపోరు పేరుతో యాత్ర చేపట్టబోతున్నాం. ఈ యాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశామో చెప్పబోతున్నాం.

జగన్ మద్యపాన నిషేధం అన్నారు…. ఎక్కడా లేదు. నాణ్యత లేని మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ధరల స్థిరీకరణ నిధి అన్నారు… ఎక్కడా అమలు కాలేదు. తుపాను వస్తే ఇప్పటికీ రైతులను ఆదుకోలేదు. భాజపాను ఆశీర్వదించాలని ప్రజాపోరు యాత్ర ద్వారా కోరతాం.

క్లస్టర్ ల వారీగా బూత్ కమిటీలు ఏర్పాటు చేశాం. 27న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వస్తున్నారు. వారు ప్రతి భాజపా కార్యకర్తను సమాయత్తం చేస్తారు. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఎంపీ, ఎమ్మెల్యే ఏ స్థానానికి పొటీ చేయాలనేది అధిష్ఠానం ఆదేశాల మేరకు చేస్తా.

LEAVE A RESPONSE