-విజయ్ మాకు బంధువు కాదు
-ఓటు నోటుకు కేసు..నాకు ఎటువంటి సంబంధం లేదు
-చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు
-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నా మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేశారు, పిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు.అతను బిజెపిలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుండీ సస్పెండ్ చేసింది.ఎన్ఐఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేస్తుండు.విజయ్ అనే వ్యక్తీ ని అంతే మోసం చేశాడు.
ఎన్ఐఆర్ వాళ్లు అందరు నాకు పరిచయస్తులు.చరణ్ పై చాలా కేసులు ఉన్నాయి.దొంగ పత్రాలు పెట్టి కబ్జాలు చేయటం, అనేక కేసులు అతని పై ఉన్నాయి.40 యేండ్ల పాటు రాజకీయాల్లో ఉంటున్న, నా పై ఎటువంటి మచ్చ లేదు.వాస్తవాలు తెలుసుకొని ప్రెస్ మిత్రులు వార్తలు రాయాలి. విజయ్ అనే వ్యక్తి మా బంధువని వార్తలు రాస్తున్నారు, విజయ్ మాకు బంధువు కాదు.
ప్రణిత్ రావు ఎవరో నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదు. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడి, కేసులు పెట్టారు. కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాని ఎస్పీ రిజర్వ్డ్ చేశారు. ఓటు నోటుకు కేసు..నాకు ఎటువంటి సంబంధం లేదు. వార్త డైవర్ట్ అవుతోంది ఓటుకు నోటు కేసు పై నేను స్పదించను.