గెలుపే లక్ష్యంగా పని చేయాలి

– ఏపీ బిజెపి ఎన్నికల సహా ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి మరియు మిత్రపక్ష తెలుగుదేశం, జనసేన లతో కలసి సమన్వయంతో కార్యక్షేత్రంలో పనిచేయాలనే లక్ష్యంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అతిధిగా సిద్దార్ధ నాధ్ సింగ్ హాజరై పార్టీ అధికార ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి , అరాచకాల పైన ఎప్పటికప్పుడు అధికార ప్రతినిధులు స్పందించాలని.. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు , పధకాలు ను ప్రజల వద్దకు మీడియా మాధ్యమాలద్వారా తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్యక్ర మంలో ప్రధానమంత్రినరేంద్రమోదీ బొప్పుడి సభ అనంతరం ఇప్పటి వరకు మీడియా ద్వారా ప్రజలకు ఏఏ సమాచార చేరవేసింది అలాగే భవిష్యత్ లో పార్టీ అధికార ప్రతినిధుల ద్వారా ప్రజల చెంతకు సమాచారాన్ని చేరవేయడానికి చర్యల పైన పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్ వివరించారు.

పార్టీ మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం సమావేశానికి అధ్యక్షత వహించి మీడియా కు సంబందించిన అంశాల పై పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు వివరించారు. సమావేశంలో సమన్వయ కర్తగా పేరాల శేఖర్ జీ వ్యవహరించగా పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply