ఐఏఎస్ సత్యనారాయణ, ధనుంజయరెడ్డిని తప్పించండి

-వారిద్దరి అధీనంలో సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ
-వైసీపీ కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపు
-కోడ్‌కు సీఎంఓ పాతర
– రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫిర్యాదు

ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన సీఎఫ్‌ఎంఎస్ ను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదీనంలోకి తీసుకుంది.
సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే కాంట్రాక్టర్‌లకు సీఎఫ్‌ఎంఎస్ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కార్యాలయం నుంచే అనేక చెల్లింపులు జరుగుతున్నాయి. వెంటనే ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలి. ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుజయ్ రెడ్డిలను తక్షణమే విధుల నుంచి తప్పించాలి.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఇంకా ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్లో జగన్ ఫోటో ఎలా పెడతారు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్‌లో సంక్షేమ పథకాలపై చారిత్రక సమాచారం ఉంది. సీఎంకు సంబంధించి అన్ని ఫోటోలు, సంక్షేమ పథకాల సమాచారం ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుండి తొలగించాలి. ఎన్నికల కోడ్‌ను విస్మరించినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలి.

Leave a Reply