– రాష్ట్రాన్ని గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్న తాడేపల్లి తాబేదారులు కూనం పూర్ణచంద్రరావు కుటుంబం వైసీపీ సభ్యులే
– పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చి జగన్ రెడ్డి యువత భవితను చిదివేస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ కు క్యాపిటల్గా మార్చి యువతను డ్రగ్స్ మత్తులో బానిసలను చేసి వైసిపి వారి జీవితాలతో చెలగాటమాడుతుందని ఈ దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని కోరారు.
కల్తీ మద్యం మాఫియా తో ఎన్నాళ్లు ప్రజల ఇల్లు ఒళ్ళు ప్రాణాలు బలి తీసుకున్నారని, ఇప్పుడు డ్రగ్స్ తో యువతను భవిష్యత్తును చిదిపేస్తున్నారు అని అన్నారు. విశాఖలో దొరికిన భారీ కోకైన్ మాఫియా అంతా జగన్ పార్టీ వారేనని అన్నారు. విశాఖను స్టేట్ కాపిటల్ గా మారుస్తానని చెప్పిన జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాగా మార్చారని విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయన్నారు.
కూణం పూర్ణచందర్రావు వైసిపి సీనియర్ నాయకుడని కుటుంబం మొత్తం వైసిపి వ్యవస్థాపక సభ్యులేనని స్పష్టం చేశారు. డ్రగ్ మాఫియా తో ఎలాంటి సంబంధం లేకుండానే బ్రెజిల్ దేశాధ్యక్షుడికి విజయసాయిరెడ్డి ఎందుకు ట్విట్ చేశారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల హస్తం ఉందని, అందుకే వైసిపి నేతలు తీవ్రంగా స్పందించారని, 16వ తేదీన కంటైనర్ వస్తే 20వ తేదీ వరకు సిబిఐ అధికారులను నిల్వరించారని, సిబిఐ అధికారుల విధులకు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఆటంకాలు ఎందుకు కల్పించారు చెప్పాలన్నారు.
టిడిపి హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే నాడు ఏపీని జగన్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ రవాణాలో ప్రథమ స్థానంలో చేర్చాడని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ మాఫియా కు చెందిన కూనాం వీరభద్రరావు కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 50 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన జగన్ రెడ్డి, వైసిపి పెద్దలు సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆపాదించే కుట్ర చేయటం దుర్మార్గమని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.