వైసీపీ పాలనలో వెంకటేశ్వరస్వామి ఆస్తులకు రక్షణ ఏదీ?

-టీటీడీ బోర్డు నిర్ణయాలు వెబ్ సైట్ లో ఎందుకు ఉంచటం లేదు?
-కరుణాకర్ రెడ్డి వచ్చాక వివరాలేవీ వెబ్సైరట్‌లో కన్పించట్లేదు
-బడ్జెట్‍ కు విరుద్ధంగా రూ.1,300 కోట్ల పనులకు ఆమోదించారు
-టీటీడీ చైర్మన్, ఈవో కి ఎన్నికల సంఘం నిభంధనలు వర్తించవా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

కలియుగం దైవం వెంకటేశ్వరస్వామి ఆస్తులకు వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని, ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో తమ వారికి కాంట్రాక్టులు కట్టెబట్టి కమీషన్లు దండుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ద్వజమెత్తారు.

మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. టీటీడీ వెబ్సైెట్లో ఏ వివరాలు పెట్టరు.. అంతా రహస్యమే. డబ్బులిచ్చే భక్తులకు ఖర్చుల లెక్కలు చెప్పట్లేదు. టీటీడీకు సమాచార హక్కు చట్టం వర్తించదని వారే ప్రకటించుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా నియమతులయ్యాక వివరాలేమీ వెబ్ సైట్ లో కనిపించటం లేదు. ఆర్దిక విషయాల్లో ఏ మాత్రం పారదర్శకత లేదు. టీటీటీ బోర్డు మీటింట్ లో ఏం జరిగిందో, తీసుకున్న నిర్ణయాలంటే బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

ఎంత విలువైన ఇంజనీరింగ్ పనులు ఇచ్చారో ఈ వివరాలేమీ వెబ్ సైట్ లో ఉండవు. కేంద్ర ప్రభుత్వం తన విధాన నిర్ణయాల్ని, జీవోల్ని ఆన్ లైన్ లో పెడుతున్నా…టీటీడీ జీవోలు మాత్రం ఆన్ లైన్ లో పెట్టడం లేదు. ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్ రెడ్డే అన్నీ తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. కాంట్రాక్టులు వారి మనుషులకే కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్నారు. సాధారణంగా నెలకొక సారి టీటీడీ సమావేశం జరుగుతుంది. కానీ కరుణాకర్ రెడ్డి వచ్చిన్నప్పటి నుంచి 15 రోజులకొకసారి మీటింగ్ నిర్వహించి కాంట్రాక్టులు ఆమోదింపజేసుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి వచ్చినప్పటినుంచి (సెప్టెంబర్ 2023) బోర్డు రిజల్వూషన్ ఆన్ లైన్ లో పెట్టడం లేదు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయినా 3 నెలల్లోనే సుమారు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ వివరాలు ఏమీ లేవు.

జవహర్ రెడ్డి ఈవో గా ఉన్నపుడు అన్ని వర్క్ లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లు అన్ని వివరాలున్నాయి. ధర్మారెడ్డి ఈవో అయిన నుంచి వివరాలేమీ లేవు. బడ్జెట్ కి సంబందం లేకుండా కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకున్నారు. మొత్తం బడ్జెట్ లో 3 వ వంతు అదనపు బడ్జెట్ కి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 1233 కోట్లు కేటాయించుకున్నారు. కరుణాకర్ రెడ్డి కుమారుడు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నారు.

అభివృద్ధి ముసుగులో కుమారుడి గెలుపు కోసం కొత్త నిర్ణయాలా? 2023 సెప్టెంబర్ లో కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాక రూ. 7.211 కోట్ల విలువైన పనులను ఆమోదింప చేసుకున్నారు. 2023 – 24 కి మెత్తం ఇంజనీరింగ్ బడ్జెట్ రూ. 300 కోట్లు. సెప్టెంబర్ లో రూ. 7.211 కోట్లు, అక్బోబర్ లో రూ. 96.61 కోట్లు నవంబర్ లో రూ. 435 కోట్లు ఆమోదింపచేసుకున్నారు. 2,3 సత్రాలు ఆగమేఘాలపై కూల్చి వేశారు. అక్కడ కొత్తగా ఒక్కోటి రూ. 300 కోట్లతో కట్టాలంట.

బాగున్నవి కూల్చేసి కొత్తగా కట్టాల్సిన అవసరం ఏంటి? అవి నిర్మించాలంటే సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. కనీసం బిల్డింగ్ డిజైన్లు కూడా లేకుండా వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతున్నాయి. దీనిలో ముఖ్యమంత్రికి వాటాలున్నాయి. సత్రాలు కూల్చటంతో పేద భక్తులు అలిపిరి దగ్గర చెట్ల కింద ఉండాల్సిన దుస్డితి నెలకొంది.

కొడుకు గెలుపు కోసం తిరుపతి పట్టణంలో రూ. 950 కోట్ల వర్క్ లు తీసుకున్నారు. సిమ్స్ కార్డియాలజీ జనరల్ రిపేర్స్ తో పేరుతో రూ. 300 కోట్లు తీసుకున్నారు. రెండు మూడు నెలల్లో రూ. 950 కోట్ల వర్క్ ఆర్డరులిచ్చి అందులో 10 శాతం కమీషన్లను కొట్టేశారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నా కొత్తగా వర్క్ ఆర్దర్లులివ్వటం ఓటర్లను ప్రభావితం చేయటం కాదా? ఇది ఈసీకి కనిపించదా?

రూ. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 300 కోట్లు ఉన్న బడ్జెట్ ని రూ. 1500 కోట్లకు పెంచారు. నిబంధనలకు విరుద్దంగా వ్వవహరిస్తున్న ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోకపోగా ఆయన పదవీకాలం పొడిగించాలంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ కి లేఖ రాయటం ఏంటి? గతంలో కూడా ప్రధానికి లేఖ రాశారు. ఒక ఐఏయస్ ఆపీసర్ కోసం ముఖ్యమంత్రి ఎందుకు ఇంతలా ఆరాటపడుతన్నారు. తన కొడుకు గెలుపు కోసం కరుణాకర్ రెడ్డి నిభంధనలకు విరుద్దంగా వ్యవరిస్తుంటే ఈసీ ఎందుకు మౌనంగా ఉంది? కేంద్ర, రాష్ట్ర నిభంధనలు కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డికి వర్తించవా? టీటీడీ ధార్మిక సంస్ధ, చైర్మన్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి.

కానీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఒక పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని ఎలా మాట్లాడతారు? ఇది ఉద్యోగుల్ని, భక్తులను ప్రభావితం చేయటం కాదా? ఎన్నికల కోడ్ నే కాదు , టీటీడీ చట్టాన్ని సైతం కరుణాకర్ రెడ్డి ఉల్లంఘిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. ఎన్నికలయ్యే వరకు చైర్మన్ ని పక్కనపెట్టాలి. ఈవో ధర్మారెడ్డిని బదిలీ చేయాలి. 2,3 సత్రాల పనులు నిలిపివేసి దానిపై విచారణ జరిపించాలి. బడ్జెట్ కి సంబందం లేకుండా జరిగిన కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే వరకు నీ ఆస్తుల్ని నువ్వే రక్షించుకో స్వామి అంటూ ప్రజలంతా ప్రార్దిస్తున్నారని విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

Leave a Reply