బాబుకి కృతజ్ఞతాభివందనలు

– హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు బివి వెంకటరాముడు

బలహీనవర్గాలే పునాదిగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ టిడిపి స్థాపించాకే బిసిలకు రాజకీయ, ఆర్థిక దన్ను లభించింది. బిసిలకు తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని మరోమారు రుజువైంది. ఒక సాధారణ బిసి కుటుంబంలో పుట్టిన నన్ను అత్యంత కీలకమైన హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కి, యువనేత నారా లోకేష్ కి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకి సర్వదా కృతజ్ఞుడిని.

తెలుగుదేశం పార్టీలో బిసిలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మరోమారు నిరూపితమైంది. నన్ను హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించడానికి సహాయ, సహకారాలు అందించిన ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

హిందూపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను. యువగళం, శంఖారావం కార్యక్రమాల సందర్భంగా మీడియా మిత్రులు అందించిన సహకారం మరువలేనిది. అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా నేను చేపట్టే నూతన బాధ్యతల్లో కూడా మీవంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాను.

Leave a Reply