Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు

-అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం
ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు..ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి
-వైసీపీ మళ్లీ వస్తే మీ సొంత ఆస్తులపైనా హక్కులుండవు
-యువశక్తిని నిర్వీర్యం చేసి…సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్
-యువత జీవితాన్ని చీకటిమయం చేసిన జగన్ ను ఇంటికి పంపాలి
-వైసీపీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్
-ద్రవిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి అన్ని కోర్సులు అందుబాటులోకి
-కుప్పం యువత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

కుప్పం :- యువత ఉత్సాహం చూస్తుంటే నాకు మళ్లీ నా పాతరోజోజులు గుర్తొస్తున్నాయి. విద్యార్థి రాజకీయాల నుండి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా.
• యువతను ఎప్పుడు చూసినా నాకు ఉత్సాహం వస్తుంది. నేను ఆధారపడింది యువశక్తిపైనా…పని చేసింది…చేసేది యువత కోసమే. ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది.
• ఏ వ్యక్తి అయినా పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు…మహాత్మగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టిన వారే. నేను కూడా చిన్న రైతు కుటుంబంలో పుట్టాను.
• నా చిన్నతనంలో లాంతర్లు పెట్టి చదువుకున్నా. ఉక్కు కండరాలు ఉండే యువతను నాకు ఇవ్వండి ప్రపంచాన్ని మారుస్తానని స్వామి వివేకానంద అన్నారు…ఆయన అన్నదాన్ని నేను నిరూపించా.
• బాగా చదివిస్తే యువత ప్రపంచాన్నే జయిస్తారు. వందల ఎకరాలు, డబ్బులు ఇచ్చినా తెలివిలేని వాడు అయితే పోగొట్టుకుంటాడు.
• నాడు ఎలక్ట్రానిక్ ఎక్స్ ఛేంజ్ పెడతానంటే ఎగతాళి చేశారు…కానీ చేసి చూపించాను. డి రెగ్యులేషన్ తో టెలీకమ్యునికేషన్ విధానాన్ని తీసుకొచ్చాం. నా తమ్ముళ్లకోసం జీవితాంతం పని చేస్తా.

• రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు. యువత నిరాశతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేవు. మీ జీవితాలను చీకటి మయంచేసిన జలగను ఇంటికి పంపాలి.
• మోసం చేయడంలో జగన్ దిట్ట. జాబ్ కేలండర్ ఇస్తానన్నాడు…ఐదేళ్లు అయింది ఒక్క జాబ్ కేలండర్ అయినా వచ్చిందా.?
• యేటా డీఎస్సీ అన్నాడు…పెట్టాడా…పోతూ పోతూ డీఎస్సీ అన్నాడు.
• జగన్ వేలకోట్లు సంపాదించాలి…ఆయన పక్కునున్న దొంగలు వందల కోట్లు సంపాదించాలి. కానీ యువతకు మాత్రం ఐదు వేలు జీతం ఇచ్చే ఉద్యోగం కావాలి.
• మొన్నొక మంత్రిని చూశా హోటల్ సప్లై చేస్తూ యువతను కూడా అలాగే చేస్తానని చెప్పాడు.
• సరసమైన ధరలకే జగన్ గంజాయి వదిలాడు. ఎక్కడ బట్టినా గంజాయి దొరుకుతుంది. బె.బ్రాండ్స్ తీసుకొచ్చాడు. బ్రెజిల్ నుండి 25 వేల కేజీల డ్రగ్స్ విశాఖ పోర్టుకు తీసుకొచ్చారు.

• మన రాష్ట్రంలోని యువతంతా ఆలోచించాలి…మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. వైసీపీని చిత్తుగా ఓడిండి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.
• 2018లో గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక విధానాలను మార్చి డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. నిరుద్యోగులు పోరాడారు…న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మాన్యువల్ గా చేయాలని చెప్పింది. కానీ వీళ్ల మనుషులకు ఉద్యోగాలు ఇవ్వాలని మాన్యువల్ మూల్యాంకనం చేశారని కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో కోర్టు వాతలు పెట్టింది.
• ఎన్నో ఏళ్లు చదివి మీరు ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం పోస్టులు అమ్ముకుంది.

• జగన్ ను హెచ్చరిస్తున్నా…యువతను భవిష్యత్తును నాశనం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఏపీ గతంలో పెట్టుబడులకు చిరునామా. ప్రపంచమంతా నాడు తిరిగి రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాను.
• అనంతజిల్లాకు కియా మోటార్స్ తెచ్చా..మనదగ్గర తయారైన కార్లు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. వీళ్లు వచ్చాక జాకీ పరిశ్రమ వాటా అడిగి తరిమేశారు. అమర్ రాజా పరిశ్రమను కూడా వేధించి తెలంగాణకు తరిమేశారు.
• ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులను కూడా పెట్టుబడులు పెట్టనీయడం లేదు. ఐదేళ్లలో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి వచ్చిందా…ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా?.

• కియాకు 650 ఎకరాలు ఇచ్చి వేల ఉద్యోగాలు తెచ్చాం..కియా కార్లు 12 లక్షలు రోడ్లు మీద తిరుగుతున్నాయి. కానీ 8 వేల ఎకరాలు లేపాక్షి భూములను నాలెడ్జ్ హబ్ కు తీసుకున్నారు…కానీ వాటిపై ఇప్పుడు జగన్ కన్ను బడింది. 10 వేల కోట్లు విలువ చేసే భూములను రూ.500 కోట్లకు కొట్టేయాలని చూశారు.
• భూములు కేటాయించి ఉద్యోగాలు నేను ఇస్తే….స్కాములపైనే స్కాములు చేసిన వ్యక్తి జగన్.
• కుప్పం గ్రానైట్ ఎంతో పేరుగాంచింది. 5 ఏళ్లుగా వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. కేజీఎఫ్ తరహాలు గ్రానైట్ తవ్వి అమ్మేసుకుంటున్నారు…ఇక్కడే ఇలా జరిగితే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి.?

• గనులు, ఇసుక, బెరైటీస్ లాంటి ఖనిజ సంపదనంతా దోచేశారు. ప్రజల ఆస్తి ప్రజలకే అందాలి.
• టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లోకి వెళితే అరిష్టం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. జగన్ ఇంట్లో కూర్చుని ఏమేమి రికార్డులు మార్చాలో వివరాలన్నీ రాసుకున్నారు. ఒంటిమిట్టలో సుబ్బారావుకు చెందిన 3 ఎకరాల భూమిని రాకార్డులు తారుమారు చేసి లాక్కున్నారు. దీంతో కుటుంబలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
• వైసీపీ మళ్లీ వస్తే మీ ఇంటి మీద కూడా మీకు హక్కులుండవు.
• వైసీపీని యువత భూస్థాపితం చేయాలి. నా మీద కేసుల మీద కేసులు పెట్టాను. నా జీవితంలో భయం అనేది ఎరగలేదు. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతా.

• మూడు పార్టీలు కలిశాక కొందరు అనుమాన పడుతున్నారు. ఎన్డీయేలో ఉన్నా, లేకున్నా మైనారిటీలకు న్యాయం చేసింది టీడీపీనే.
• ఉర్దూను రెండు భాషగా చేశాం. మైనారిటీ సంక్షేమం కోసం కార్పొరేషన్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. నేను హజ్ హౌస్ లు కడప, విజయవాడలో నిర్మించా.
• మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చాం. రంజాన్ తోఫా ఇచ్చాం…దుల్హన్ కింద రూ.50 వేలు ఆర్థికసాయం అందించింది. ఈప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కపనైనా చేసింది. పార్లమెంట్ లో తెచ్చిన అన్ని పాలసీలకు వైసీపీ ముందుండి మద్ధతు తెలిపింది.
• కానీ మేము రాష్ట్రాన్ని బాగుచేయడానికే పొత్తు పెట్టుకన్నాం. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశాడు అప్పుల అప్పారావు. వ్యవస్థలను సర్వ నావనం చేశాడు.

• కేంద్రం సాయం లేకపోతే రాష్ట్ర ముందుకు సాగడం కష్టం అవుతుంది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి…అమరావతిని నాశనం చేశారు…మహిళలపై దారుణాలు పెరిగాయి…వీటన్నింటినీ సరి చేయడానికే ఎన్డీయేలో చేరాం.
• సీట్లు కోసం కాదు…రాష్ట్రాన్ని కాపాడటానికి బాధ్యతగా కలిసి ముందుకు వస్తున్నాం. జండాలు మూడు…కానీ మా అజెండా ఒక్కటే…అది ఏపీని కాపాడుకోవడమే. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలి.. అప్పుడే యువత భవిష్యత్తుగా బంగారం అవుతుంది.
• అధికారంలోకి వచ్చాక యువగళం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేల భృతి ఇస్తాం.
• కుప్పంను బెంగళూరు, కోలార్, కృష్ణగిరితో అనుసంధానం చేస్తాం. ఏ రైలువచ్చినా కుప్పంలో ఆగేలా చేస్తాం. విమాశ్రయాన్ని కూడా నిర్మిస్తాం…అక్కడి నుండే వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు పంపవచ్చు.

• పాడి పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేస్తాం. 20 అంశాలతో కుప్పం అభివృద్ధికి విజన్ రూపొందిస్తా.
• వైసీపీ నమ్ముకుంది రౌడీ ఇజాన్నే. వాలంటీర్లకు మనం వ్యతిరేకం కాదు…ఇంజనీరింగ్ చేసినవాళ్ల కూడా వాలంటీర్లుగా చేస్తున్నారు.
• వైసీపీ నేతలు చేయించే తప్పుడు పనులతో వాలంటీర్లు జైలుకు వెళ్లొద్దు. వాలంటీర్లు కూడా సమాజంలో భాగమే…వారిని కొనసాగించి మెరుగైన జీవితాన్ని అందిస్తాం.
• ఉద్యోగులకు జీతాలు ప్రజలు కట్టే పన్నులు నుండే వస్తాయి…రాజకీయ జోక్యం ఉద్యోగులు చేసుకోకూడదు.
• కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ కు ఓటేయరు. 2004లో కొత్తవాడు వస్తే ఇంకా బాగు చేస్తాడని అనుకుని ఓటేశారు…కానీ ఏం జరిగింది.? మళ్లీ 2019లో దుర్మార్గుడు వచ్చి ఒక్క ఛాన్స్ అనడంతో ఐస్ అయ్యారు…నిజస్వరూపం చూపించి దాడులు, పిడిగుద్దులు గుద్దాడు.

• డ్రామాల్లో జగన్ నెంబర్ వన్. హంద్రీనీవా నీళ్లు అంటూ సినిమా సెట్టింగ్ వేసి గేటు బెట్టి బురద చేశారు. జగన్ వెళ్లిపోయాక గేటు పీకేశాడు…బురద ఆరిపోయింది. ఇంకో నాటకంతో మళ్లీ కొత్త బిక్షగాడు మళ్లీ వస్తాడు. వాళ్లు చేసిన అన్యాయాలు చూసి చిత్తుగా ఓడించాలి.
• ఎన్డీయే ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం పెడతాం.
• ఇప్పుడు వదిలిన డీఎస్సీని కొనసాగిస్తే ఈ దుర్మార్గులు మళ్లీ మ్యానేజే చేసి వారికి అనుకూలమైన వారని నియమంచుకునే ప్రమాదం ఉంటుంది…ఎన్నికల కమిషన్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలి.
• ద్రవిడ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి అన్ని కోర్సులను ప్రవేశపెడతాం. కుప్పంను నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తా.

LEAVE A RESPONSE