Suryaa.co.in

Andhra Pradesh

చేతకాని వారే కుల,మతాలు రెచ్చగొడతాడు!

కుంచనపల్లి రచ్చబండలో యువనేత నారా లోకేష్

తాడేపల్లిః పనిచేయడం చేతగానివారే కుల, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తారని యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుంచనపల్లిలో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… గెలిచే సీట్లు సొంత సామాజికవర్గం వారికి కేటాయించి, ఓడిపోయే సీట్లను ఇతర సామాజిక వర్గాల వారికి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించింది. వైసిపి కుటిల రాజకీయాలపై కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలి.

2014లో తండ్రి, 2019లో బాబాయిని చంపి ఆ శవంతో జగన్ రెడ్డి సానుభూతి పొందారు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులను చంపేసి శవరాజకీయం చేస్తున్నారు. నన్ను, పెమ్మసానిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డబుల్ ఇంజన్ లా పనిచేసి దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని లోకేష్ పేర్కొన్నారు. ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి విధ్వంస పాలన ప్రారంభమైంది. ఆనాడు కుల, మతాలకు అతీతంగా పారిశ్రామికవేత్త అయిన అయోధ్యరామిరెడ్డిని చంద్రబాబు ప్రోత్సహించారు. కనీసం కృతజ్ఞత లేకుండా చంద్రబాబు కుమారుడు లోకేష్ పై నీచ రాజకీయాలు చేస్తున్నారు. పదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గానికి ఆర్కే చేసిందేమీ లేదు. గుంటూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా కాపులను బలిచేస్తున్నారు. ఇష్టం లేకపోయినా బెదిరించి పోటీలో నిలిపారని అన్నారు.

లోకేష్ ఎదుట కుంచనపల్లి వాసుల సమస్యలు
కుంచనపల్లి వాసులు తమ సమస్యలను లోకేష్ కు చెబుతూ కోతలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. కుంచనపల్లిని కార్పొరేషన్ నుంచి తప్పించి గ్రామ పంచాయతీగా మార్చాలి. ఇళ్లులేని వారికి ఇళ్లపట్టాలు ఇవ్వాలి. రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. హైస్కూల్, బస్సు సౌకర్యం కల్పించాలి. గంజాయికి అడ్డుకట్టవేయాలి, ఐటీని అభివృద్ధి చేయాలని కోరారు. లోకేష్ స్పందిస్తూ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగానే కోతలు లేకుండా సంక్షేమం అందిస్తామన్నారు. కుంచనపల్లిని గ్రామ పంచాయితీగా మార్చే విషయంలో ప్రజాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకుంటామని లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE