Home » ఐదు గ్యారంటీలతో జాతీయ మేనిఫెస్టో

ఐదు గ్యారంటీలతో జాతీయ మేనిఫెస్టో

 -మేనిఫెస్టో కాదు…భారతదేశ ఆత్మ
-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

-తెలంగాణ జన జాతర సభలో విడుదల
-బీజేపీ బారినుంచి రాజ్యాంగాన్ని,
-ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం
-రిజర్వేషన్ల పరిమితిని పెంచుతాం
-కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ
-జనజాతర సభకు పోటెత్తిన జనం

హైదరాబాద్‌, మహానాడు:రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ప్రకటించిన ఈ వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించాం..కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసు.. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది..ఇచ్చిన మాట ప్రకారం జాతీయ స్థాయిలోనూ గ్యారంటీలను అమలు చేస్తాం..ఇది కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో మాత్రమే కాదు.. భారతదేశ ఆత్మ. ఈ మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తుక్కుగూడలో జనజాతర సభలో ఆయన జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. సభకు తరలివచ్చిన లక్షలాది మందిని ఉద్దేశించి ప్రనంగించారు. యువ న్యాయం పథకం ద్వారా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.

దేశంలో విద్యావంతులైన యువతకు నెలకు రూ.8500 ఉపకార వేతనంతో ఏడాదిపాటు అప్రంటీస్‌ షిప్‌ శిక్షణ అందిస్తాం..మహిళా న్యాయం పథకం ద్వారా ప్రతీ పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తాం. దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు..మోదీ ప్రభు త్వం కార్పొరేట్‌ కంపెనీలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసింది..కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదు..కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. రైతు న్యాయం పథకం ద్వారా రైతు రుణాల మాఫీ చేస్తాం.. స్వామినాథన్‌ కమిటర్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. కార్మిక న్యాయం ద్వారా కార్మికు లకు సామాజిక, ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. దేశంలో 50 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారు. 15 శాతం మైనారిటీలు ఉన్నారు. 5 శాతం ఇతర పేద వర్గాలు ఉన్నాయి..మోదీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సమన్యాయం జరగడం లేదు.. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతాం…ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్‌ 50 శాతం మించకూడదనే పరిమితిని తొలగిస్తాం..

రాష్ట్రంలో కేసీఆర్‌…కేంద్రంలో మోదీ
మాజీ సీఎం ఇంటెలిజెన్స్‌, పోలీస్‌ వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారో మీరు చూశారు..ఫోన్‌ ట్యాపింగ్‌ డేటాను ధ్వంసం చేశారు. ఇక్కడ కేసీఆర్‌ లాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది..ఈడీని బలవంతపు వసూళ్ల సంస్థగా మార్చేశారు.. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ రద్దు ఒక పెద్ద కుంభకోణం.. సీబీఐ పేరుతో భయపెట్టి కంపెనీల నుంచి పార్టీ ఫండ్‌ తీసుకుంటుంది…తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిరచాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడిరచబోతున్నాం.. రాజ్యాంగం ప్రజలకు రక్షణ.. కానీ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది..రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతాం.. బీజేపీ వైపు కార్పొరేట్‌ కంపెనీలు, ధనం ఉంది.. ఇవేవీ లేకపోయినా కాంగ్రెస్‌పై ప్రజల ప్రేమ ఉంది…మీతో నాకున్నది రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం..నా జీవితాతం మీకు సేవ చేస్తూనే ఉంటా..నా జీవితాంతం తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా..ఏదో ఒక రోజు మేడ్‌ ఇన్‌ తెలంగాణ అనేది మేడ్‌ ఇన్‌ చైనా కంటే బలంగా వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తా…జైల్లో డబుల్‌బెడ్‌ రూం కట్టిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
‘‘కేసీఆర్‌ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని ఆయన అనుకుం టున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని.. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతాం. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టిస్తాం’’ అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.. పదేళ్లు దోపిడీ దొంగల్లా.. అడవి పందుల్లా దోచుకున్న కేసీఆర్‌..ఇప్పుడు వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడుతున్నారు..మా కాంగ్రెస్‌ కార్యకర్తలు తలచుకుంటే మీ ఒంటి మీద అంగీ లాగు కూడా మిగలదు..కాలు విరిగిందని కొంతకాలం మేం సంయమనం పాటించాం..మీరేం చేసినా మేం ఊరుకుం టామనుకోవద్దు… కేసీఆర్‌కు నేను సవాల్‌ విసురుతున్నా..డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిన చోట మీరు ఓట్లు అడగండి… ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట మేం ఓట్లు అడుగుతాం.. మీకు డిపాజిట్లు వస్తాయో లేదో చూద్దాం.. వంద రోజుల్లో మేం మంచి పరిపాలన అందిస్తే తెలంగాణలో 14 లోక్‌సభ స్థానాలు గెలిపించండి.. తెలంగాణ సమాజం అభివృద్ధికి భవిష్యత్తుతో నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.. గంటకో డ్రస్‌ మార్చే మోదీ కావాలో.. ప్రజల కోసం దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్‌ గాంధీ కావాలో నిర్ణయించుకోండి..ఈ ఎన్నికల్లో ఈడీ, ఐటీ, సీబీఐల మోదీ కుటుంబం గెలుస్తుందో.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం గెలుస్తుందో చూద్దామని సవాల్‌ విసిరారు.

ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి
సోనియమ్మ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన గడ్డపైనే రాహుల్‌ గాంధీ దేశానికి ఐదు గ్యారంటీలు ప్రకటించారు. ఇక్కడ మిమ్మల్ని చూస్తోంటే ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి, దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది ఒకేసారి పోటెత్తినట్లుంది..మీ శ్రమ, మీ కష్టం, మీ త్యాగంతోనే తెలం గాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరది..తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి తీసుకొద్దాం.. గుజరాత్‌ మోడల్‌పై వైబ్రాంట్‌ తెలంగాణ మోడల్‌ ఆధిపత్య చూపడం ఖాయం..రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి? 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 7.20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? 750 రైతులను చంపినందుకు బీజేపీకి ఓటు వేయాలా? ప్రతీ పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మోదీ.. తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. దక్షిణ భారతం, ఉత్తర భారతం మధ్య చిచ్చు పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. గతంలో హైదరాబాద్‌ వరదల్లో మునిగితే సిగ్గులేని కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేదు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టినట్టే.. కేంద్రంలో బీజేపీని బొంద పెట్టాలి..

Leave a Reply