Suryaa.co.in

Andhra Pradesh

రేపల్లెలో చంద్రబాబును కలిసిన అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు

-అమర్నాథ్ సోదరి హేమశ్రీ చదువు బాధ్యతల్ని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ

రేపల్లె :- రేపల్లెలో ప్రజాగళం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబును అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు కలిశారు. గతేడాది తన అక్కను వేధించిన వైసీపీ సానుభూతిపరుడు వెంకటేశ్వరరెడ్డిని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే పదవ తరగతి విధ్యార్థిపై పెట్రోల్ పోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి టీడీపీ అండగానిలిచి పోరాడింది.

బాధిత కటుంబానికి నాడే పార్టీ తరపున చంద్రబాబు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. హేమశ్రీ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రజాగళం కార్యక్రమానికి నిన్న రేపల్లె వెళ్లిన చంద్రబాబును కుటుంబ సభ్యలతో వెళ్లి హేమశ్రీ కలిసింది. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. హేమశ్రీ ఉన్నత చదువులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను పోలీస్ అవ్వాలనుకుంటున్నాని హేమశ్రీ చెప్పగా…నువ్వు కష్టపడి చదవు అన్ని విధాగాలుగా అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE