Suryaa.co.in

Andhra Pradesh

కమీషన్ల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలు

-ఇంటర్ ఫలితాలు పడిపోవడానికి జగన్ అసమర్థత, అవినీతి, కమీషన్లే కారణం
-కళాశాలలకు డ్రగ్స్, గంజాయి సరఫరా
-వైసీపీ సభలకు విద్యార్థుల తరలింపే కారణం
-జగన్ చర్యలతో 7 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం
-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం

మంగళగిరి: కమీషన్ల కోసం సైకో జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ విద్యార్థుల జీవితాలతో ఆటలాడారని.. బ్రహ్మం మండిపడ్డారు. జగన్ రెడ్డి అసమర్థత వలన విద్యార్థుల ఉత్తీర్ణత 62 శాతానికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు భారీగా ఫెయిల్ అవ్వడానికి సైకోరెడ్డి విధానాలే కారణమన్నారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలను దూరం చేసి, మధ్యాన్న భోజనం లేకుండా చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టారన్నారు. ట్యాబ్ ల మీద, బైజూస్ కు నిధులు ఇచ్చేందుకు జగన్ కు ఉన్న శ్రద్ధ బడిపిల్లల భవిష్యత్ పై లేదన్నారు. జగన్ కమీషన్ల కక్కుర్తి విద్యార్థుల జీవితాన్ని రోడ్డున పడేసిందన్నారు. దేశంలోనే అత్యధిక విద్యార్ధులు ఫెయిల్ అయిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.

కళాశాలలకు డ్రగ్స్, గంజాయి సరఫరా… వైసీపీ సభలకు విద్యార్థల తరలింపు
కళాశాలలకు గంజాయి, డ్రగ్స్, కొకైన్లను సరఫరా చేయించి విద్యార్థులను మత్తులో ముంచారన్నారని జగన్ పై బ్రహం మండిపడ్డారు. కాలేజీల్లో పాఠ్యపుస్తకాలు కంటే గంజాయి ఎక్కువగా దొరకుతుందన్నారు. జగన్ రెడ్డి మీటింగ్ లకు విద్యార్థుల తరలించి.. విద్యార్థులకు చదువును దూరం చేసి విద్యార్థులు ఫేయిల్ అవ్వడానికి కారణం అయ్యారన్నారు. జగన్ రెడ్డి విద్యా వ్యస్థను నిర్వీర్యం చేయడంవలనే ప్రభుత్వ కళాశాల్లో ఉత్తీర్ణత మరింత పడిపోయిందన్నారు. దీనికి జగనే బాధ్యత వహించాలన్నారు. విద్యావస్థను బ్రష్టు పట్టించడమంటే రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించడమేనన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో 7 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని బ్రహ్మం చౌదరి మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో అద్యాపకులను ఏర్పాటు చేయకపోగా.. మౌలికసదుపాయాలు కల్పించకుండా.. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పేద విద్యార్థులపై చిత్త శుద్ధి లేదన్నారు. ప్రజా వేదిక విధ్వంసం కంటే విద్యావవ్యస్థను రెండింతలు విధ్వంసం చేశారన్నారు. అందరికి అమ్మఒడి అని చెప్పి కొందరికే ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

నాడు కేంద్రం ఇచ్చిన ర్యాంకుల్లో చంద్రబాబు హయాంలో 3వ స్థానంలో ఏపీ విద్యావ్యవస్థ ఉంటే… నేడు 19వ స్థానంకు పడిపోయిందన్నారు. జగన్ పాలనలో 29 నుండి 76వ స్థానంకు ఏయూ ర్యాంక్ చేరిందన్నారు. చంద్రబాబు హయంలో పదో తరగతిలో 92.06 శాతం ఉత్తీర్ణత ఉంటే… వైసీపీ పాలనలో విద్యార్థుల ఉత్తీర్ణత దారుణంగా 62 శాతం పడిపోయిందన్నారు. అయినా ఇంటర్ ఇంటర్ ఫలితాలపై సాక్షి టీవీ, సాక్షి పేపర్లు మసిపూసి మారేడుకాయ చేయడం సిగ్గుచేటన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలి
విద్యార్థుల భవిషత్ పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలని.. జగన్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని.. జగన్ విద్యంసకాన్ని గమనించాలని బ్రహ్మం తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలోనే విద్యాభివృద్దికి విశేష కృషి చంద్రబాబు చేశారని.. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం నగదు ఇస్తామని తెలిపారు. విద్యావ్యవస్థ బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు తీసుకునే విద్యారంగ సంస్కర్ణలతోనే విద్యార్థలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

వైసీపీ ఎస్టేట్ గా ఏపీపీఎస్సీ.. వైసీపీ అనుంగులకే గ్రూప్ 1 పోస్టులు అమ్మకాలు అందుకే అర్థరాత్రి ఫలితాలు
అర్థరాత్రి గ్రూప్స్1 పరీక్షల ఫలితాలు విడుదల చేయడంపై బ్రహ్మం మండిపడ్డారు. ఏపీపీఎస్సీని వైసీపీ ఎస్టేట్ గా మార్చారన్నారు. జగన్ వైససీపీ జెండా మోసిన కార్యకర్తలను ఏపీపీఎస్సీ మెంబర్లగా నియమించి పోస్టులను వైసీపీ అనుంగులకు అమ్ముకున్నారని తెలిపారు. దీనిపై కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపట్టి.. వైసీపీ అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

పారి పోయిన పరిశ్రమలు
సైకో జగన్ రెడ్డి అధికారం చేపట్టాక ఏపీకి పరిశ్రమలు రాకపోక ఉన్న పరిశ్రమలు పారిపోయాయని బ్రహ్మం చౌదరి తెలిపారు. ఉద్యోగాలను కల్పించడం చేతగాని ఈ చవట దద్దమ్మ ప్రభుత్వం. ఉన్న పరిశ్రమలను కూడా తరిమి కొట్టారన్నారు. పరిశ్రమలు లేకపోవడంతో పనుల కోసం యువత పక్కరాష్ట్రాలకు వెళ్లే దుస్తితి ఏర్పడిందన్నారు.

ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా లేదు
ఎన్నికల ముందు నిరుద్యోగుకు లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్ సన్నాయి నొక్కులు నొక్కి అధికారం వచ్చాక నిరుద్యోగులను మోసం చేశాడని బ్రహ్మం చౌదరి మండిపడ్డారు. అధికారం చేపట్టిన ఐదేళ్లలో ఒక్క మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన పాపాన పోలేదన్నారు. మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులను జగన్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఈ మోసాల ఈవైసీపీ త్వరలోనే యువత తప్పకుండా తగిన బుద్ధి చెబుతారన్నారు.

LEAVE A RESPONSE