పొత్తు పెట్టుకోవడం తప్పేమీ కాదే..ముసుగు తీయొచ్చుగా..?

– ఒక అపవిత్ర అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం
– వీళ్లే అశాంతిని సృష్టించి..దానిపై పోరాడుతున్నాం అంటూ హంగామా
– చంద్రబాబు అవసరానికి తగ్గట్లు ఒక్కో పాత్రను వాడుకుంటాడు
– మళ్లీ పగటి వేషగాళ్లు వస్తున్నారు…అప్రమత్తంగా ఉండండి
-ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేకుండా ప్రతిపక్షాలు ఏకం కావాలి అంటున్నారు
– జగన్‌ గారి పాలనలో తప్పు పట్టడానికి ఏమీ లేదు కాబట్టే..సినిమా డైలాగులు
– ప్రజల హక్కులను హరించే అంశాలు ఆ జీవోలో చూపిస్తే మేం జవాబు ఇవ్వడానికి సిద్ధం.
– వారి వల్లనే ఈ జీవో నంబర్‌ 1 వచ్చిందనే విషయాన్ని కూడా పక్కకు నెట్టి తెగించి అబద్దాలు
– ఇద్దరూ రెండున్నర గంటలు చర్చించిందేమిటో ప్రజలకు చెప్పొచ్చుగా..
– లోకేష్‌ పాదయాత్రలో పవన్‌ పాత్ర ఏమిటో చర్చించుకున్నారా..?
– రెండు పార్టీల అధ్యక్షులు కూర్చుని మాట్లాడినప్పుడు ఎజెండా అంటూ లేకుండా ఉంటుందా..?
– బీజేపీ…వారితో కలుస్తుందా లేదా అనేది వారి సొంత విషయం…
– జగన్మోహన్‌రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించగలమనే పగటి కలలు నెరవేరవు
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడారంటే.. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడేం చేయాలనే డైరెక్షన్‌ మొత్తం చంద్రబాబు దగ్గర నుంచే వస్తోంది.పొత్తులు పెట్టుకోవడం వాళ్లు ఎందుకు ఓపెన్‌ గా చేయలేకపోతున్నారు..?నిజంగా ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవడం తప్పేమీ కాదే..కేరళలోకానీ, కేంద్రంలో ఎన్డీఏ కానీ అలానే ఫ్రంట్‌లా ఏర్పడ్డవే. అలా పొత్తులు పెట్టుకుని, ఒక ఫ్రంట్‌ కిందకు వాళ్లంతా రావచ్చు. వాళ్లు అలా చేయలేకపోవడానికి కారణం వారి వద్ద ప్రజలకు సంబంధించిన ఎజెండా లేకపోవడమే. చంద్రబాబు నాయుడు తన అవసరానికి తగ్గట్లుగా వాడుకోవడం వల్లే ఒక్కో పాత్ర పరిమితంగా వస్తోంది..పరిమితంగా పోతోంది. ఆ అపవిత్ర అక్రమ సంబంధానికి ఒక పవిత్రతను అంటగట్టడానికి ప్రయత్నం చేశారు. నిన్న కలవడానికి వాళ్లు చూపిన కారణం చాలా అన్యాయంగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌కు ప్రజలపై మమకారం ఉంటే పరామర్శించడానికి వెళ్లాల్సింది చనిపోయిన వారి కుంటుంబాల వద్దకు రోడ్లపై సమావేశాలు, సభలు పెట్టి ప్రజలు బాగా వచ్చారని చూపే ప్రయత్నాల్లో ప్రజల ప్రాణాలకు హాని ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో ఒక జీవో ఇస్తే దానికి కట్టుబడకుండా చంద్రబాబు దాన్ని ఎలా ఉల్లంఘించాలనే ప్రయత్నం చేశాడు. చివరికి వాహనం లేదంటే బస్సు కూడా ఎక్కి మొండిగా వ్యవహరించిన తీరును పవన్‌ కళ్యాణ్‌ ఖండించాల్సింది.వాస్తవాని పవన్‌ ప్రాణాలు పోగొట్టుకున్న అమాయకుల కుటుంబాలను పరామర్శించాలి.వారి మరణానికి కారణమైన చంద్రబాబు వైఖరిని ఖండించాలి.కానీ చనిపోయిన వారిని వదిలేసి చంపిన చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారు. ఇది అన్యాయానికి, బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కార్యకర్తలు మా మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు.. పవన్‌ పరామర్శించడానికి వెళ్తాడు. ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత వీళ్ల డ్రామా అంతా స్పష్టంగా తెలిసిపోతోంది.వీళ్లే అశాంతిని సృష్టించి..దానిపై పోరాడుతున్నాం అంటూ హంగామా చేస్తున్నారు.

వాళ్లకి భయపడాల్సిన అవసరమే లేదు…వాస్తవాలు చెప్పడానికే మా స్పందన:
ఒక రాజకీయ పార్టీ ఒక సామాజిక వర్గానికే పరిమితం కాదు. కానీ వీళ్ల రహస్య కలయిక మాత్రం రెండు కులాలను కలిపే ప్రయత్నంలా కన్పిస్తోంది.ఆ రెండు సామాజిక వర్గాల మధ్య పెద్దగా సఖ్యత లేదు కాబట్టి జగన్‌ గారిని కారణంగా చూపి కలిసే ప్రయత్నం చేశారువీళ్ల కలయికపై మాకు, ప్రజలకు ఒక క్లారిటీ ఉంది.కానీ వారి అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడకు ఎత్తిచూపాల్సిన అవసరం ఉంది.ఉదాహరణకు పచ్చ మీడియా జీవో నంబర్‌ 1 విషయానికి వస్తే ఇటీవల సంఘటనలను చెప్తూ రోడ్లపై సభలు పెట్టుకోవద్దని మాత్రమే ఉంది. జీవోలో లేని ఆంక్షలు ఉన్నట్లు చూపెడుతూ..మా పార్టీ ర్యాలీ తీస్తే బూతద్ధంలో చూపెడుతున్నారు. ఇలా రోజు రోజుకీ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్న తరుణంలో మేం స్పందిచాల్సి వస్తోంది..ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సి వస్తోంది.పగటి వేషగాళ్లు వస్తున్నారు..మళ్లీ రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి వస్తున్నారు…అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేకుండా ప్రతిపక్షాలు ఏకం కావాలి అంటున్నారు..
జరుగుతున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు కూడా చంద్రబాబు యాక్షన్‌ ప్లాన్‌లో భాగమే.చంద్రబాబు అవసరానికి అనుగుణంగా ఎవరి పాత్ర వాళ్లు పోషిస్తున్నారు.ఇంకా ఎవరైనా ఉంటే కలిస్తే మంచిది…ఒక క్లారిటీ అయినా వస్తుంది.ఇది శుభపరిణామం, ఇప్పటికే కలిసి ఉండాల్సింది అని సీపీఐ రామకృష్ణ అంటున్నాడు. నాకు తెలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్లను కమ్యూనిస్టు పార్టీలు అసలు దగ్గరకు కూడా రానివ్వవు. కానీ వీళ్లు బీజేపీని కలుపుకోడానికి విపరీతంగా ఉబలాటపడుతున్నారు దాని కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణాలోనూ నాకు బలముందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఏపీలో పొత్తు పెట్టుకుంటే తెలంగాణాలో మద్దతు ఇస్తానని చెప్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ కూడా వాళ్లిద్దర్నీ కలపాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.కేవలం జగన్‌ గారిని దింపేయాలనే కోరికతో తప్ప ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేకుండానే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలంటున్నారు.మాకైతే ఎవరు ఎలా కలిసినా ఒక స్పష్టత వస్తే బాగుంటుందని కోరిక.

జగన్‌ పాలనలో తప్పు పట్టడానికి ఏమీ లేదు కాబట్టే..సినిమా డైలాగులు
అక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఒకటీ లేదు. కేవలం సినిమా డైలాగులతో నిరంకుశత్వం, చీకటి అంటూ నోటికొచ్చిన మాటలతో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అంటున్నారు. దానికి వ్యతిరేకంగా ఓటేసినందుకే 2019లో చంద్రబాబునాయుడిని ప్రజలు పక్కన పెట్టారు.2014లో ఆయన మంచి పరిపాలన ఇచ్చి ఉంటే ప్రజలు ఆయనకే ఓటు వేసి ఉండే వారు కదా..ఆయన అలా చేయలేదు కాబట్టే, ప్రజా వ్యతిరేకి కాబట్టే ఆయన్ను చెత్తబుట్టలో పడేశారు.మా పాలనలో చూపడానికి ఏదీ లేదు కాబట్టి లేని అబద్దాలన్నీ కల్పిస్తున్నారు.మేం వీళ్ల మాటలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.మారీచుల్లా మాయమాటలు చెప్పి భ్రమల్లో పెట్టి, మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.

మీకు మీరే స్క్రిప్ట్‌ రాసుకుని..తృప్తి పడితే ఎలా..?
జీవో నంబర్‌1 లో ఏముందని మీడియానే వాళ్లను ప్రశ్నించాలి.ఏమీ లేనప్పుడు లేనివన్నీ ఎందుకు చెప్తున్నారని మీడియానే పెద్దమనిషి పాత్రను తీసుకుని అడగాలి.మేమేదో భయపడుతున్నట్లు వాళ్లకు వాళ్లు ఊహించుకుని, తాము కలిసినందువల్ల ఏదో జరిగిపోతుందనుకుంటే వారి ఖర్మ.స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు కలిసే పని చేశారు. అయినా చిన్నపాటి ఫలితం కూడా వారికి రాలేదు.ప్రజల్లో వారిపై నమ్మకం రాలేదనేందుకు ఆ ఎన్నికలే నిదర్శనం. మీకు మీరే డ్రామా స్క్రిప్ట్‌ రాసుకుని దాని నుంచి తృప్తి పొందుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఫలానా విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్‌ అయిందని చెప్పడానికి వారి వద్ద ఒక్కటంటే ఒక్క విషయం కూడా లేదు.జీవో నంబర్‌ 1 ఏ నేపథ్యంలో వచ్చింది..? 11 మంది అమాయకులు చనిపోతే భవిష్యత్తులో అలాంటివి జరగకూడదని వచ్చింది. జీవో నంబర్‌1పై ఇంతకు మించి ఇంకేదైనా ఆంక్షలు, ప్రజల హక్కులను హరించే అంశాలు వాళ్లు చెప్తే మేం జవాబు ఇవ్వడానికి సిద్ధం..మీ అంతటకి మీరే జీవో నంబర్‌1 చీకటి జీవో అంటూ పదిసార్లు చెప్తే..దాన్ని ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నం అని మేమంటాం.వారి వల్లనే ఈ జీవో నంబర్‌ 1 వచ్చిందనే విషయాన్ని కూడా పక్కకు నెట్టి తెగించి అబద్దాలు మాట్లాడుతున్నారంటే వాళ్లదగ్గర మాట్లాడటానికి ఏమీ లేదని భావించాల్సి వస్తోంది.

ఆ మూడు గంటలు ఆ జీవోలో అక్షరం అక్షరం చదివారా..?
పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు కలుస్తున్నాడో అందరికీ తెలిసిందే. అక్కడ ఏం మాట్లాడుకుంటారో కూడా అందరికీ తెలిసిందే.మూడు గంటలు కూర్చుని వాళ్లు ఏం మాట్లాడుకున్నారు…ఆ చర్చల్లో సారాంశం ఎందుకు బయటకు రాలేదో..?మూడు గంటల పాటు జీవో నంబర్‌ 1లో అక్షరం అక్షరం చదువుకుంటూ పోయారా..?
కొత్తగా కార్యాచరణ ఏమైనా రూపొందించుకున్నారా..? రోడ్‌ మ్యాప్‌ అంటే ఎటువంటిదనేది వాళ్లే చెప్పాలి.లోకేష్‌ పాదయాత్ర మొదలైతే వీళ్లేం చేయాలనేది మాట్లాడుకున్నారా..? లేక సీట్ల గురించి మాట్లాడుకున్నారా..? ప్యాకేజీలుంటే అవి మాట్లాడుకున్నారా..?రెండు పార్టీల అధ్యక్షులు కూర్చుని మాట్లాడినప్పుడు ఎజెండా అంటూ లేకుండా ఉంటుందా..? పరామర్శిండానికే వెళ్తే కప్పు కాఫీ తాగితే పది పదిహేను నిమిషాల్లో బయటకు రావాలి కదా?లేదు ఏదైనా ఎజెండా ఉంటే ఓపెన్‌ గా చెప్పాలి.2014–19 మధ్య చంద్రబాబు తాను చేసిన పొరపాట్లు కరెక్ట్‌చేసుకుంటాను అని చెప్పాడని పవన్‌ అన్నా చెప్పాల్సింది.ఇవన్నీ చెప్పకుండా బయటకు వచ్చి రాసిచ్చిన స్క్రిప్ట్‌లో ఉన్నదంతా చదివి వెళ్లిపోయారు.మేం ఎక్కడకు పోయినా ఎంత మంది జనం వచ్చినా పోలీసులే కంట్రోల్‌ చేయాలంటారు.చీకటి జీవో..నిరంకుశత్వం అంటారు తప్ప వాళ్ల మధ్య జరిగిన డీల్‌ ఏమిటో చెప్పడం లేదు.

బీజేపీ వారితో కలుస్తుందా లేదా అనేది వారి సొంత విషయం…
ఒక రాజకీయ పార్టీగా మరో రాజకీయ పార్టీలు కలిసి వస్తాయా లేదా అనేది వాళ్లకు సంబంధించిన విషయం.జగన్మోహన్‌రెడ్డి ఎజెండా పేద ప్రజలకు సంబంధించిన ఎజెండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సమానంగా తీసుకొచ్చే అడుగులు వేయాలని ఆయన కోరిక.మేం అలా అడుగులు వేసినంత కాలం ఎంత మంది కలిసి వచ్చినా మాకేమీ అభ్యంతరం లేదు. వాళ్లంతా కలిసి వచ్చి మాతో పోటీ పడితే మంచిదే. మరింతగా మెరుగ్గా మేమూ సేవ అందించడానికి వీలు పడుతోంది. బీజేపీని తీసుకొస్తానని పవన్‌కళ్యాణ్‌ అంటున్నాడు…ఆయన పొత్తులు అనలేదు కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటున్నాడు. ఆయన అనలేదు కానీ…ఈనాడు మాత్రం పొత్తు దిశగా అడుగులు అంటోంది.వాళ్లు వాళ్లు కలిస్తే మంచిదే కానీ..దాంట్లోనే కమ్యూనిస్టులు కలుస్తారా..? అదీ మాకు మంచిదే.
ప్రత్యుర్ధులు ఎవరు…ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా మాకు స్పష్టమవుతుంది.వారు ఏ వర్గాలకు ప్రయోజనం కల్పించాలనుకుంటున్నారో కూడా ఒక క్లారిటీ వస్తే మంచిదే. ఇది ఎంత త్వరగా క్లియర్‌అయితే మాకు అంత మంచిది.వాళ్లు విడిగా ఉండాలని, ఓటు చీలాలని మేం కోరుకోవడం లేదు.
50 శాతంపైగా ఓటు బ్యాంకు ఉన్న జగన్‌ గారికి ఉంది…వాళ్లందరూ కలిసినా జగన్మోహన్‌రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించగలమనే పగటి కలలు నెరవేరవు.పది మంది కలిసి పోతే ఎవరిని విశ్వసించాలో ప్రజలకు తెలియదు కాబట్టి ఒక్కడే వెళ్లాలని మా నాయకుడు అనుకుంటున్నాడు. జగన్‌ ని దించి చంద్రబాబును కూర్చోబెట్టడటమే వారి ఎజెండా

రాష్ట్రం సుభిక్షంగా ఉండటం వారికిష్టమే లేదు:
రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా సరే పథకాలేవీ ప్రజలకు చేరకూడదు..దానికి కావాల్సిన ఆర్ధిక వనరులు పుట్టకూడదు అని ఎల్లో గ్యాంగ్‌ కోరిక.ఆదాయం పెరగకూడదు…బయట అప్పులు పుట్టకూడదు..కేంద్రం నుంచి రావాల్సింది రాకూడదు అనేది వారి ప్రయత్నం.రాష్ట్రంలో జగన్‌ పెట్టిన పథకాలేవీ కూడా అమలు కాకూడదు అనేది వారి ప్రయత్నం.వాళ్లు రోజూ చేస్తుంది ఇదే కదా…ఇప్పుడు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే మాకేం కాదు.గత మూడేళ్లుగా వాళ్లు చేస్తున్న పనంతా ఇదే కదా.

Leave a Reply