Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ సమక్షంలో బెజవాడ నేతలు చేరిక!

ఉండవల్లి: జగన్ అరాచక పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలసిరావాలన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పిలుపుతో వివిధవర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖులు చెన్నుపాటి శ్రీనివాస్, పరమేష్ (పెనమలూరు)లు టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారిద్దరికీ యువనేత లోకేష్ పసుపు కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కలసివచ్చే నాయకులందరికీ టిడిపి ద్వారాలు తెరిచే ఉంటాయని లోకేష్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ నగరంలో పార్టీ విజయం కోసం పనిచేయాలని, ఎన్నికల తర్వాత తగిన గుర్తింపునిస్తామని చెప్పారు.

LEAVE A RESPONSE