కార్యకర్తలే మా కుటుంబానికి కొండంత బలం

– వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీనే..
– నారా భువనేశ్వరి

కదిరి టౌన్: తెలుగుదేశంపార్టీ కార్యకర్తలే మా కుటుంబానికి కొండంత బలం, అండ అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కదిరి పట్టణం, 8వ వార్డులో పార్టీ కార్యకర్త మద్దెగళ్ల ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, మహిళలతో భువనేశ్వరి మాట్లాడుతూ…మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మాకు అండగా నిలబడింది పార్టీ కార్యకర్తలే. చంద్రబాబును చేయని నేరానికి వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టిన సమయంలో నాకు, నా కుటుంబానికి పార్టీ కార్యకర్తలే ధైర్యం చెప్పారు.

పార్టీ కార్యకర్తల రుణం తీర్చలేనిది. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మేం అండగా నిలబడతాం. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ఎక్కడా కృంగిపోకుండా, పడిపోకుండా నిలబడదాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే…అని భువనేశ్వరి అన్నారు.

Leave a Reply