మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం హైదరాబాద్ లో హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలతో మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీక.. భారత అభివృద్ధి పయనంలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.