Suryaa.co.in

Andhra Pradesh

‘స్పందన’ పేరు మార్పు

– చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్పందన’ వ్యవస్థ ప్రక్షాళనను ప్రభుత్వం చేపట్టింది.’స్పందన’ పేరును శనివారం తొలగించింది. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతలను స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించగా.. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A RESPONSE