Suryaa.co.in

Andhra Pradesh

ఒక రోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం

– శాసనసభ్యులు వనమాడి కొండబాబు

కాకినాడ: సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.శనివారం స్థానిక 39 వ డివిజన్ రామారావు పేట నందు సచివాలయ సిబ్బంది తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారని, సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన లబ్ధిదారులు అందరికీ పెన్షన్ అందజేస్తున్నామన్నారు.

LEAVE A RESPONSE