Suryaa.co.in

Andhra Pradesh

రాజు గారూ.. స్వతంత్రుడిగా బరిలో నిలవండి

– మిమ్మల్ని గెలిపించుకుంటాం
– ఆర్ ఆర్ ఆర్ ని హైదరాబాదులో కలిసిన బాలకోటయ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యులు కె. రఘురామకృష్ణంరాజును అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హైదరాబాదులో బుధవారం ఆయన స్వగృహంలో కలిశారు. ఇటీవల నరసాపురం పార్లమెంట్ ఎంపీ సీటును పోత్తులలో భాగంగా తెలుగు దేశం పార్టీ బిజెపికి కేటాయించటం, బిజెపి పార్టీ తన పార్టీకి చెందిన శ్రీనివాస్ వర్మకు ప్రకటించడంతో రఘురామకృష్ణం రాజు పోటీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటికే నరసాపురం పార్లమెంటు బరిలో స్వతంత్ర అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తే వెన్నంటి ఉండి గెలిపించుకుంటామని బాలకోటయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాలకోటయ్య స్వయంగా హైదరాబాద్ వచ్చి రఘురాం కృష్ణంరాజు తో మాట్లాడటం మరో చర్చకు తెర లేపింది. బాల కోటయ్య కూడా అమరావతి, దళితోద్యమాలలో వారి గళాలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

రెండు, మూడు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడుతోందని, లేనిపక్షంలో రఘురామ తీసుకునే నిర్ణయానికి తాము అండగా ఉంటామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం మీద ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులకు చట్టసభల ప్రక్రియలో అన్యాయం జరగటాన్ని సహించబోమని ఘాటుగా వ్యాఖ్యానించారు . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాడిన తమకు ఎంతటి వారు ఎదురొచ్చినా పోరాడితీరుతామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE