Suryaa.co.in

Andhra Pradesh

ఉపరితల ఆవర్తనం!

-కోస్తాంధ్రలో ఎల్లో అలర్ట్ జారీ

విశాఖపట్నం: ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్నిచోట్ల అతి భారీ, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పల్నాడు, ఏలూరు, ఎన్ టి ఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీరంలో మత్య్సకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటలలో కైకలూరులో ఆరు సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయింది. విజయవాడలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

LEAVE A RESPONSE