(మల్లిక్ పరుచూరి, కెమికల్ ఇంజనీర్)
Butyric acid (Butyrate) వల్లనే వెన్నకి Butter అని పేరు వచ్చింది. టిటిడి వాళ్ళు పంపించిన శాంపిల్ ఆవు నెయ్యి లో Butyric Acid C4:0 అసలు లేకపోవడం నిజంగా వింతే. వెన్న లేకుండానే నెయ్యి తయారు చేశారు. అంటే ఏ స్థాయిలో కల్తీ జరిగిందో చూడండి. వెన్న తో తయారు చేయని నెయ్యి ఇది..సో, కల్తీ అనేది 100% నిజం.
టెస్ట్ చేసిన శాంపిల్ నెయ్యిలో “లారిక్ యాసిడ్” 12.663% ఉంది. అంటే నెయ్యిలో కొంత వరకు “కొబ్బరి నూనె ” లో ఉండే Lauric acid C12:0 కలిపారు. కొబ్బరి నూనె లో ఉండే, మిగతా Caproic acid (C6:0),Caprylic acid (C8:0),Capric acid (C10:0)లు చాలా తక్కువ ఉన్నాయి శాంపిల్ లో. కొబ్బరి నూనె రేటు 320 ₹ కంటే ఎక్కువ. వీళ్ళు నెయ్యే రూ.319 కి అమ్ముతున్నారు. మరి అదే రేటుతో ఉన్న కొబ్బరి నూనె ఎందుకు కలుపుతారు?
అందుకే కొబ్బరినూనె నుండి MCT oil seperate చేశాక, మిగిలే Lauric acid తక్కువ రేటుకు దొరుకుతుంది. కేజీ 110 – 115/-.దీంతో కల్తీ చేసారు.
అయితే “లారిక్ యాసిడ్” కలిపితే నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అయితే పచ్చగా ఉంటుంది. అందుకే ఈ నెయ్యి పచ్చగా కనిపించటానికి, ఎక్కువ మోతాదులో Palmitic acid కలిపారు.
శాంపిల్ లో Beta sterol 175mg/kg ఉంది. అసలు ఇది నెయ్యిలో ఉండదు. ఇది ఉంది అంటే వెజిటబుల్ ఆయిల్ mix చేశారు అని అర్థం. బీటా Sterols Plant Source లో తప్ప వేరే fats లో ఉండవు, సో, కొంత vegetable oil కూడా కలిపారు!
మామూలుగా డైరీల్లో పచ్చి పాల నుంచి తీసే ఆవు నెయ్యిలో Palmitic acid 22-25% మాత్రమే ఉంటుంది.గేదె నెయ్యిలో 28% వరకు వుంటుంది. అయితే శాంపిల్ రిపోర్ట్ మాత్రం, Palmitic acid 40% ఉందని తేలింది. సో, ఇక్కడ కూడా కల్తీ జరిగింది.
ఏమి కల్తీ జరిగింది అంటే… 40% Palmitic acid రావాలి అంటే పాం ఆయిల్ కానీ, జంతు కొవ్వు కానీ కలిపి ఉంటారు. Palmitic acid 40% రావటానికి, ఏఆర్ డైరీ వాడింది ఏంటి అనేది సిట్ అధికారులు తేల్చేస్తే, ఈ విషయం తేలిపోతుంది. పాం ఆయిల్ రేటు, పంది కొవ్వు కంటే ఎక్కువగా ఉంది. Palmitic acid కోసం పామాయిల్ వాడారా ? లేక గొడ్డు కొవ్వు వాడారా, లేదా పంది కొవ్వు వాడారా ? 40% Palmitic acid సోర్స్ ఏంటి ? ఈ ఒక్క విషయం తేలితే, మొత్తం తెలుస్తుంది.
మొత్తానికి కల్తీ అయితే 100% నిజం. వెన్న లేకుండా “నెయ్యి” చేశారు. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ఆసిడ్ వాడారు. అలాగే వెజిటబుల్ఆయిల్ వాడారు. ఇక Palmiticacid 40% ఉంది. అంటే జంతు కొవ్వు కలిపినట్టే! అయితే దీని పై మరింత లోతుగా సైంటిఫిక్ అనాలసిస్ చేసి.. ఏవీ,ఎంత వాడారు అనేది ఖచ్చితంగా చెప్పాలి!
పవిత్ర తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపి, కొవ్వు పట్టినట్టు వ్యవహరిస్తూ, అసలు మేము పంపించిన జంతు కొవ్వుతో, లడ్డూలు చేయలేదు అంటూ, తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి ఫేకు ముఠా.. జంతు కొవ్వుతో కలిపిన ఆ నెయ్యి, అసలు, తిరుమల లడ్డూ తయారీలో వాడలేదని ఎవరూ చెప్పలేరు.. నాలుగు ట్యాంకర్లు వాడారు, భక్తులు వాసనలో తేడా ఉందని ఫిర్యాదు చేశారు. తరువాత వచ్చిన నాలుగు ట్యాంకర్లు టెస్ట్ చేసి, అవి వెనక్కు పంపారు ఇవి అసలు వాస్తవాలు:
పాయింట్ ఆఫ్ ఆర్డర్
– జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం, ఏఆర్ డెయిరీ నుంచి తొలి ట్యాంకర్ జూన్ 12వ తేదీన టీటీడీకి చేరింది. జూన్ 21, 25 , జూలై 4వ తేదీన మరో మూడు ట్యాంకర్ వచ్చాయి.
– మొత్తం 4 నెయ్యి ట్యాంకర్లు టీటీడీ లేబొరేటరీలో పరీక్షించారు. ఇక్కడ జంతు కొవ్వు కల్తీ టెస్ట్ చేసే సామర్ధ్యం లేదు. ఈ ల్యాబ్ లో కేవలం కొన్ని బేసిక్ పారామీటర్స్ అయిన Moisture, RM Value, Rancidity, Iodine Value, Milk Fat లాంటి చిన్న చిన్న టెస్టింగ్ లు మాత్రమే ఇక్కడ జరుగుతాయి. ఈ టెస్టుల్లో, ఈ 4 ట్యాంకర్లు పాస్ అయ్యాయి. దీంతో, ఇవి లడ్డూ తయారీకి ఉపయోగించారు.
– ఈ నాలుగు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యితో లడ్డూలు తయారు చేయగా, వాసన రావటం, లడ్డూ నాణ్యత లేకపోవటం మరీ ఎక్కువగా ఉందని, భక్తులు ఫిర్యాదు చేసారు. అంటే ఈ నాలుగు ట్యాంకర్లలో జంతు కొవ్వు కలిపారు కాబట్టి, లడ్డూలో వాసన వచ్చింది.
– వెంటనే అలెర్ట్ అయిన టిటిడి ఈవో, తర్వాత అంటే జులై 6వ తేదీన వచ్చిన 2 ట్యాంకర్లు, 12న వచ్చిన మరో రెండు ట్యాంకర్లని, టిటిడి ల్యాబ్ లో కాకుండా, గుజరాత్ లో ఉన్న ఎన్‌డీడీబీ ల్యాబ్‌లో పరీక్షించారు. ఇక్కడ జంతు కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది
– వెంటనే ఈ నాలుగు ట్యాంకర్లని తిప్పి పంపించారు. వెంటనే ఆ కంపెనీ పై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెట్టారు.