మానవుడే మహనీయుడు

శిలను శిల్పంగా
చేయటానికి శిల్పి కి
కావలసిన సాధనాలు ఉలి, సుత్తి.
శిలను చెక్కటానికి ఉలి;
ఉలి మీద బలంగా దెబ్బ పడటానికి మద్దతుగా సుత్తి
వాడతారు శిల్పులు.
శిలను శిల్పంగా మార్చటానికి ఈ రెండు సాధనాలు శిల్పి కి నూటికి నూరుశాతం అవసరం.
కానీ ఈ రెండు సాధనాలు
శిల్పానికి అవసరమే కానీ
ఇవి ఎటువంటి
రూపాంతరం చెందటం లేదు.
వాటి గొప్పతనాన్ని ఎవరూ కీర్తించటం లేదు.
శిల్పులు పేరును గడిస్తున్నారు, మన్ననలను
పొందుతున్నారు,
పతకాలు సాధిస్తున్నారు.
ఉలి, సుత్తి వలన
కఠినంగా దెబ్బలు తిన్న
శిలలు శిల్పాలు గా మారి
ప్రతిమ గా
ప్రతి హృదయానికి
చేరువవుతున్నాయి.
కడు ప్రణామములు
స్వీకరిస్తున్నాయి.
ప్రశంసలు పొందుతున్నాయి.
కస్తూరి, సుగంధాలను
అద్దించుకుంటున్నాయి.
కర్పూర నీరాజనాలను
అందుకుంటున్నాయి.
అలాగే జీవన మార్గం లో కష్టాలు, సమస్యలు,
ఇబ్బందులు ఎదుర్కొన్న
మానవుడు ఏమీ
చలించక అనుభవం అనే దివ్యాస్త్రము తో మానవాతీత శక్తి ని పొంది
విజేత గా నిలుస్తున్నాడు.
మానవుడే మహనీయుడు.

– చింతపల్లి వెంకటరమణ

Leave a Reply