న్యూఢిల్లీ: అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడుని…. జాతీయ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆగస్టు 16 17 18 తారీకులలో న్యూఢిల్లీ ఫరీదాబాద్ లో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 29 రాష్ట్రాల నుంచి రాష్ట్ర సంఘ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుకుమార్ ఎన్నికను ప్రతిపాదిస్తూ అలపర్తి విద్యాసాగర్ పేరును జాతీయ ఉపాధ్యక్షుడిగా సూచించారు. జాతీయ కార్యవర్గ సభ్యులందరూ మరియు రాష్ట్రాల ప్రతినిధులు ఎన్నికను ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. తదుపరి ఎన్నికను ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆలపర్తి విద్యాసాగర్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ తన బాధ్యతలో మరింత పెరిగాయని, జాతీయ స్థాయిలో జరిగే ఉద్యమాల కార్యాచరణ బాధ్యత కూడా తన మీద ఉంటుందని, ముఖ్యంగా జాతీయ సమస్యలైన సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులరైజేషన్, లేబర్ కోడ్ వంటి అంశాలపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన విద్యాసాగర్ ను… రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి వి రమణ, మహిళ సబ్ కమిటీ కన్వీనర్ రాజ్యలక్ష్మి, హెచ్ జీవో నాయకులు రవి శంకర్, జి.కిషోర్ మరియు మాజీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ అభినందనలు తెలిపి సత్కరించారు.