– అమెరికా ఉత్పత్తులు వాడొద్దు
– ఏపీ హోటల్ యజమానుల సంఘం నిర్ణయం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానుల సంఘం కూడా తమిళనాడు నిర్ణయాన్ని అనుసరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో పెప్సి, కోకాకోలా వంటి అమెరికన్ శీతల పానీయాలు, ఇతర అమెరికా ఉత్పత్తులను బహిష్కరించనున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం భారతీయ వస్తువులపై 50% సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. “అమెరికన్ కంపెనీలకు బదులుగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. రైతులు, స్థానిక పరిశ్రమలకు మద్దతుగా ఇలాంటి చర్యలు అవసరం” అని సంఘం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాల హోటల్ యజమానుల సంఘాలు కూడా ఇలాగే ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.