– ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. హమీలను ఎగ్గొట్టినందుకు ఆయన పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డిని ఇక నుంచి రాబందు రెడ్డి అని పిలవాలి
– ప్రజా పాలనా విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచనోత్సవాలు
– రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి
– రైతుల దగ్గరకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా?
– రేవంత్ రెడ్డి ముందు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి
– కాంగ్రెసును జనం ఓడించి బొందపెట్టడం ఖాయం
– బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలెప్పుడు అమలవుతాయా అని రైతులు, రైతు కూలీలు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనుదారుల వంటి వర్గాలన్నీ రెండేళ్లుగా ఆశగా చూస్తుంటే, హామీలను అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి. ఏ మొహం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తూ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకూలురను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఏం సాధించిందని ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలా ? ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువెల్లా దగా చేసిన కాంగ్రెస్ సర్కారుకు విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదు. ప్రజలను వంచించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినందుకు విజయోత్సవాలా … ఎందుకు విజయోత్సవాలు … ఏమి ఒరగబెట్టారని, ఏం పొడిచారని విజయోత్సవాలు … సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీటీసీ, జడ్ పిటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలి.
అపుడు నమ్మించి మోసం చేసిన కాంగ్రెసును జనం ఓడించి బొందపెట్టడం ఖాయం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తంలో ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని వాగ్ధానాలు అమలు చేసారో ప్రజలకు వివరించే దమ్ముందా ముఖ్యమంత్రికి … రెండేళ్ల పాలనపై ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే హామీల అమలుపై శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి. మంత్రులంతా తమ శాఖల్లో ఇచ్చిన హామీల్లో అమలు చేసినవెన్ని అనే అంశాలపై ప్రజలకు శ్వేతప్రతాల రూపంలో వివరణ ఇవ్వాలి.
ఎందుకు ప్రజా విజయోత్సవాలు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తము పేరుతో ఆరు గ్యారంటీల కార్డును ప్రధాన హామీగా ఇవ్వడమే కాకుండా, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ఆరు గ్యారంటీలను బాండ్ పేపర్ల రూపంలో ప్రజలకు మాటిచ్చి ఎన్నికల్లో గెలిచి, పదవులు పొందాకా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేసినందుకా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు … కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం అభయ హస్తం ఫైలు పైనే చేశారు.
క్యాబినెట్ తొలి భేటీలో కూడా అభయహస్తం ఆరు గ్యారంటీల కార్డుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించి, దానికి చట్టబద్దత కల్పించకుండా అటకెక్కించి తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు … తెలంగాణలో మార్పు తమతోనే సాధ్యమన్న కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏ రంగంలోనూ మార్పు సాధించకుండా మరింత దిగజార్చుతూ … రాష్ట్రం పరిస్ధితిని పేనం నుంచి పొయ్యిలో పడిన విధంగా మార్చినందుకా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు … బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ పధకాల్లో జరిగిన అవినీతిని వెలికితీసి కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావులను దోషులుగా నిలబెడుతామని, వారు దోచుకున్న అవినీతిని కక్కిస్తామని చెప్పి … అవేమి చేయకుండా వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సగం సొమ్మును కొట్టేసినందుకా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు … కాళేశ్వరం, మిషన్ భగీరధ స్కాములే కాకుండా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేసింగ్, ధరణి అక్రమాలపై ఇప్పటి వరకు గత ప్రభుత్వ పెద్దలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా బీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుకా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు … కాంగ్రెసు రెండేళ్ల పాలనలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కోటరి, మంత్రులు కొందరు కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతూ వేల కోట్లు వెనకేసుకుంటున్నందుకా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు …హిల్ట్ పాలసీ తెచ్చి పారిశ్రామిక వాడల్లో ఉన్న 9292 ఎకరాల భూములను కొల్లగొట్టె లంకెబిందెలు దొరికినందుకా … హిల్ట్ పాలసీ జీవో-27 బయటకు ఎలా వచ్చిందని ఎంక్వయిరీ నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. తమది ప్రజా ప్రభుత్వం – పారదర్శక పాలన అంటున్నసీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ డొమూనులో పెట్టాల్సిన జీవో-27 బయటకు ఎలా వెళ్లిందని విచారణ జరిపించడం దారుణం.
ఆ జీవో బయటకు రాకుండా ఉంటే గుట్టుచప్పుడు కాకుండా రూ.ఆరు లక్షల 29 వేల కోట్ల స్కామ్ కు పాల్పడుదామనుకున్నారు. హిల్ట్ పాలసీ మాదిరిగా ఇంకా భూములను కొల్లగొట్టేలా ఉన్న జీవోలన్నింటినీ పబ్లిక్ డొమెనులో పెట్టాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం శాఖల వారీగా జారీ చేసిన జీవోలన్నింటినీ పబ్లిక్ డొమైనులో పెట్టాలి. సిఎం రేవంత్ రెడ్డి నీకు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్ వంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై రైతుల దగ్గరకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా? అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అన్నావు, నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అని ఇచ్చిన హామీలపై నిరుద్యోగుల వద్దకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా? – వృద్ధులకు నెలకు ఇచ్చే పెన్షను మొత్తాన్ని రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు. దివ్యాంగులకు ఇచ్చే నాలుగు వేలపెన్షను మొత్తాన్ని ఆరు వేలకు పెంచాతమన్నారు.
ఈ హామీలపై వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా ? మహాలక్ష్మీ పధకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం … అలాగే కాలేజీలకు వెళ్లే యువతలకు ఇస్తామన్న స్కూటీలపై, వివాహం చేసుకునే ఆడపడుచులకు కళ్యాణమస్తు పధకం కింద లక్షరూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలపై అక్కచెల్లల వద్దకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా ? వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్న హామీపై కూలీల వద్దకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా? ఇందిరమ్మ ఇళ్ల పధకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు 3,500 ఇండ్ల చొప్పున ఈ ఏడాది నాలుగున్నర లక్షల గృహాలను నిర్మిస్తామని ఇచ్చిన హామీపై ఇండ్లు లేని పేదల వద్దకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా? అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషనుపై రైతుల వద్దకు, యూత్ డిక్లరేషన్ పై యువకుల వద్దకు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషనుపై దళితులు, గిరిజనుల వద్దకు, బీసీ డిక్లరేషన్ పై బీసీ సోదరుల వద్దకు వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా? అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అలవికానీ హామీలు.
ఆచరణ సాధ్యం కాని హామీలు, బూటకపు హామీలు 420 ఇచ్చారే … వాటిపై ప్రజల్లోకి వెళ్లి ప్రజా విజయోత్సవాలు నిర్వహించే దమ్ముందా?సిఎం రేవంత్ రెడ్డి నీ రెండేళ్ల పాలనకు నిర్వహించాల్సింది ప్రజా విజయోత్సవాలు కాదు … ప్రజా వంచనోత్సవాలు … ప్రజా దగా ఉత్సవాలు. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు హమీలను ఎగ్గొట్టినందుకు ఆయన పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి. రెండేళ్ల పాలనలోనే వేల కోట్ల అవినీతికి పాల్పడినందుకు గాను … పేద రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నందుకు గాను రేవంత్ రెడ్డిని ఇక నుంచి రాబందు రెడ్డి అని పిలవాలి. తక్షణమే ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను రద్దు చేయాలి. ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.