ఇవాళ ప్రముఖ రచయిత, నటుడు,నాటక ప్రయోక్త గొల్లపూడి మారుతీరావు గారి జయంతి..
ఆయన జీవన ప్రస్థానం చాలా ఆశ్చర్య పరుస్తుంది.
ఆకాశవాణిలో అడుగుపెట్టే ముందు జర్నలిస్టు గా పనిచేశారు.ఆకాశవాణిలో చేరాక ఆయన సినీ రంగంలో అడుగు వేశారు.అనేక చిత్రాలకు సంభాషణలు సమకూర్చినా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా అరంగ్రేటం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే versatile artist.. అభిలాష,సంసారం ఒక చదరంగం, ఇది పెళ్ళంటారా వంటి సినిమాల్లో ఆయన వైదుష్యం కనిపిస్తుంది..
రచయితగా ఆయన కథలు అలరిస్తాయి.”సాయంకాలమైంది” నవల ఆలోచింపచేస్తుంది.. వేయిపడగలు ఛాయలు కనిపిస్తాయి..
ఆయన నాటకాలు కూడా పేరు తెచ్చుకున్నవే.. ముఖ్యంగా ఆయన కళ్ళు నాటకం సినిమాగా రూపొందింది..లండన్ లో ఆయన చూసిన నాటకాల గురించి ఆంధ్రప్రభ వీక్లీలో మంచి వ్యాసాలు రాశారు..
ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఆయన “జీవనకాలం” వ్యాసాలు..ఆ వ్యాసాలన్నీ సమకాలీన సమాజానికి అద్దం పడుతుండేవి
అలాగే అనేకమంది ప్రముఖులపై ఆయన ఎలిజీలు పుస్తక రూపంలో తెచ్చారు..ఆయన వచనంలో ఒక అట్రాక్షన్ ఉంది..
2017లో ఆకాశవాణి, కేంద్ర సాహిత్య అకాడమీ కలిసి నిర్వహించిన సదస్సులో పాల్గొని రేడియో నాటకం గురించి అద్భుతంగా ప్రసంగించారు..
నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుని మనకు పంచేవారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిదర్శనం గొల్లపూడి మారుతీరావు
(ట్విట్టర్ నుండి సేకరణ)
– నోముల శ్రీనివాసరావు