– అభివృద్ధి అంటే చేపల దుకాణాలు కాదు
“పులివెందులలో ఇది ఎవరైనా ఊహించారా?” అంటూ జగన్ గ్యాప్ ఇచ్చారు. ఆయన ఏం చెబుతారో అని అభిమానులు ఉత్కంఠతో, ఆసక్తిగా చెవులు రిక్కించారు. “మన పులివెందులకు చేపలు అమ్మే దుకాణాలు వస్తాయని మనం ఊహించామా?” అని ఆయన రెట్టించి అడిగారు. అది విని ప్రపంచం గొల్లున నవ్వింది, నాడు ఆ పులివెందుల సభలో ఉన్న అభిమానులు చిన్నబోయారు.
ఆ దుకాణం కాస్తా మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది; అది వేరే కథ.
పులివెందుల జనం అంతకుముందెన్నడూ చేపలు తిననట్టు, తానే కొత్తగా తెచ్చి వారికి రుచి చూపిస్తున్నట్టు జగన్ తన భ్రమలను ఒలకబోశారు. జగన్ తాత బ్రిటీష్ వారికి పంది మాంసం సరఫరా చేయకముందు నుండే అక్కడ చెరువులు ఉన్నాయి, చేపలు దొరికేవి. జనం నాటుకోడి, రాగి సంగటి నుండి పొట్టేలు మాంసం వరకు పుష్కలంగా తినేవారనే సంగతి ఊహాలోకంలో ఉండే జగన్‌కు తెలియకపోవచ్చు. ఆయన ఆలోచనల స్థాయి అది.
మరోవైపు, అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ అంటే ఏదో కొన్ని టవర్లు కడతారని అంతా అనుకున్నారు. రెండు నెలల క్రితం ఇక్కడే క్వాంటం కంప్యూటర్ తయారీ అంటే వచ్చిన వారికి కూడా నమ్మకం కలగలేదు. చంద్రబాబు అభిమానులకు సైతం కొంచెం భయం వేసింది.
కానీ నిన్న క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్, సర్టిఫికేషన్, బెంచ్‌మార్కింగ్ కోసం అమరావతిలో ‘ఓపెన్ యాక్సెస్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్’ని ప్రారంభించారు. దేశ డిఫెన్స్ బ్యాక్-బోన్ సంస్థల నుండి ఐఐటీల వరకు, పరిశోధకుల నుండి స్టార్టప్‌ల వరకు అందరినీ ఏకం చేస్తూ.. దేశం గర్వించేలా ‘అమరావతి ఎస్ 1’, ‘అమరావతి క్యూ 2’ అనే రెండు టెస్ట్ బెడ్లను ఆవిష్కరించారు.
దేశమంతా ఈ అద్భుతాన్ని ఉద్వేగంతో తిలకించింది.
అమరావతి అన్నదాతల నుండి యావత్తు ఆంధ్రప్రదేశ్ వరకు అందరూ ఆనందబాష్పాలు రాల్చారు. చంద్రబాబు నాయుడు తన బాధ్యతగా దీనిని భుజాన వేసుకుని, మూడు దశాబ్దాల తరువాత కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ అమరావతిని ‘డీప్ టెక్ క్వాంటం లీడర్’గా సగర్వంగా నిలబెట్టారు. ఊహలకు అందని ఇలాంటివి నాయుడి రేంజ్!