(తొలి రైలు పరిగెత్తిన రోజు 16.04.1853)
చుకుచుకు రైలు వచ్చింది..
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి..
ఔను..
173 సంవత్సరాల క్రితం
ఇదే రోజున..
నాలుగు వందల మంది..
బొంబాయి టు థానే..
దూరం తక్కువే(34 కిమీ)..
కాని..
ఒక ఘనచరితకు శ్రీకారం..
మహావ్యవస్థకు నుడికారం..
కూ కూ బండి అయింది
సువిశాల భారతావని
ప్రగతి రథం..
ఈడేరిన భారతీయుల మనోరధం..!
ఒకనాటి పొగబండి..
డీజిల్ ఇంజనుగా మారి..
విద్వత్తు పెరిగి విద్యుత్తు
రైలుగా ఎదిగి..
జోరు పెరిగి..
బుల్లెట్ ట్రైనుగా
అందుకుంది జోరు..
భారతీయ రైల్వేకి జోహారు!
నీ..నా..మనందరి బండి..
అదో సరదా..
రైలు ప్రయాణం..
చిన్ననాటి అనుభూతి..
అమ్మతో..నాన్నతో
తిరుపతి యాత్ర..
అప్పర్ బెర్తు..అదెంత వర్తు..
కారు..విమానం..
వీటిని మించి ద్రిల్లు..
ఆ జ్ఞాపకాలు నెమరేసుకంటే
అదో జిల్లు..!
మొత్తానికి అలా
నాలుగు వందల మందితో
మొదలైన ప్రస్థానం..
రోజుకు 2.25 కోట్ల
ప్రయాణీకులు..
ఏటా ఒక ప్రపంచాన్నే
తిప్పేస్తూ..
భూగోళం చుట్టేస్తూ..
(ఏడాదికి 825 కోట్ల మంది..
రైల్వే పరిధి 66వేల కిమీ)
జగతిలోనే
అత్యంత భారీ వ్యవస్థ..
7500 స్టేషన్లు..
2.40 లక్షల వ్యాగన్లు..
69000 కోచులు..
9000 ఇంజన్లు..
13.50 లక్షల ఉద్యోగులు..
ప్యాసింజర్..గూడ్స్ రైళ్లు..
లోకల్..బుల్లెట్..
వందే భారత్..
మహాన్ హై మేరీ భారత్..
అదిరిపోయే రైళ్ల బారాత్..!
అత్యాధునిక వ్యవస్థలు..
పెరిగిన చార్జీలు…
సౌకర్యాలు
అన్నీ భేషు…
ఇంకా మారని
అసౌకర్యానికి చింతిస్తున్నాం
మారని తీరు..
రైళ్ల రాక..పోక..
తప్పని ఆలస్యం..
అమృతం విషం..
రైల్వేలో అతి పెద్ద దోషం..
జాగు పెరుగుతూ
నిమిషం నిమిషం..!
ఎక్కాల్సిన రైలు
జీవితకాలం లేటు..
మారని ప్రయాణీకుడి ఫేటు..!
అతి పెద్ద పేరు..
WR వెంకట నరసింహరాజు
వారి పేట…
బుల్లి నామం..
ఎల్బి స్టేషన్..
4273 కిమీ దూరం..
అదే బండి..
డిబ్రుగర్ నుంచి కన్యాకుమారి..
నాలుగు రోజుల ప్రయాణం..
ఎక్కితే చాలు అవగతమయ్యే
భారతీయ పురాణం..
నాలుగు పొద్దుల పలకరించే
తొలి కిరణం..
మూడు రాత్రులు జాబిల్లితో
ప్రేమాయణం..!
సామాన్యుని
ప్రయాణ సాధనం..
గాంధీ గారి పెట్టెలు..
ఇప్పటికీ కిటకిట..
ఉద్యోగులకు
అప్ అండ్ డౌన్ కటకట..
కంప్లెయింట్ల నమోదుకు
టోల్ ఫ్రీ..
ఎంపీలకు మాత్రం
జీవితకాలం ఫ్రీ..
ఉద్యోగులకు పాసులు..
ప్రేమికులకు టైం పాసులు..
అక్కడే కుదిరిరిపోయే పెళ్ళిళ్ళు..మారిపోయే
కొన్ని బ్రతుకు చిత్రాలు..
కొందరి జీవితాల్లో చైత్రాలు..
మొత్తంగా..రైలు..
భారతీయ సంస్కృతీ సింబల్..
– సురేష్
9948546286
7995666286