Suryaa.co.in

Business News

ఏలూరి దివ్యేష్ కి గ్లోబల్ ఫేమ్ యువ పారిశ్రామికవేత్త అవార్డు

భారతదేశంలో ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను పరిచయం చేసిన ఘనత
◆ చిన్న వయసులోనే స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించినందుకు అవార్డు
◆ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషాబసు చేతుల మీదుగా అవార్డు ప్రధానం
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను ప్రవేశపెట్టిన ఏలూరి దివ్యేష్ కు అరుదైన పురస్కారం లభించింది. పదహారేళ్ల వయసులోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించారు. వికనెక్ట్ ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఏటా వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు గ్లోబల్ ఫేమ్ అవార్డ్స్ ను అందిస్తుంది.
దీనిలో భాగంగా 2020- 2021 సంవత్సరంలో వ్యాపార రంగంలో యువ పారిశ్రామిక వేత్తగా ఏలూరి దివ్యేష్ గ్లోబుల్ ఫేమ్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది ప్రముఖ వ్యాపార దిగ్గజాల సమక్షంలో బుధవారం రాత్రి కోల్‌కతాలోని న్యూటౌన్ రాజర్‌హత్ వేదికగా ప్రముఖ బాలీవుడ్ సినీ హీరోయిన్ బిపాసా బసు చేతుల మీదుగా ఏలూరి దివ్యేష్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అతి చిన్న వయసులో యువ పారిశ్రామికవేత్త అవార్డు అందుకున్న దివ్యేష్ ను పలువురు ప్రముఖులు అభినందించారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తనయుడు కావడం గమనార్హం.
చదువుకుంటూ… వ్యాపారంలో
విద్యనభ్యసిస్తూ పదహారేళ్ళ వయసులోనే ఏలూరి దివ్యేష్ యువ పారిశ్రామికవేత్త అవార్డును అందుకున్నారు. పద్నాలుగేళ్ళ వయసులో దివ్యేష్ టవల్స్ వ్యాపారం ఆలోచన చేశారు. ఆలోచన వచ్చిందే తడవుగా టౌలైట్(towelight)బ్రాండ్ పేరుతో టవల్స్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అత్యంత సాంకేతిక పద్ధతులతో భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఫేస్ లేబుల్డ్(face Labelled), యాంటీ మైక్రోబియల్
samba1(antimicrobial) టవల్స్ ను టౌలైట్ బ్రాండ్ తో ప్రారంభించాడు. వ్యాపార రంగంలో వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టి టౌలైట్ టవల్స్ ను మార్కెట్ లో పరిచయం చేశాడు. టౌలైట్ టవల్స్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అత్యంత నాణ్యత ప్రమాణాలతో రూపొందించిన ఈ టవల్స్ బ్యాక్టీరియాను దరిచేరకుండా చేయడం, ప్రజలందరికీ అందించడంలో సఫలీకృతం అయ్యాడు. దీంతో ప్రజల పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేశారు. కరోనా లాంటి విపత్తులు సైతం దివ్యేష్ తన మేధస్సుకు పదును పెట్టి వ్యాపారరంగంలో విజయాల పరంపర కొనసాగించాడు. అతి చిన్న వయసులో విద్యనభ్యసిస్తూ తండ్రికి తగ్గ తనయుడిలా అందరు నివ్వేర పోయేలా యువ వ్యాపారవేత్త అవార్డు దక్కించుకొని ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఒకే ఒక్కడు… అన్నీ తానై
ఒకవైపు చదువుకుంటూ ఖాళీ సమయంలో తన వ్యాపారానికి సంబంధించిన అన్ని పనులు తానే చూసుకుంటూ ప్రముఖ స్థానాన్ని అందుకున్నారు. ఏ కొద్ది సమయం ఉన్న వ్యాపారంలో మెళకువలు తెలుసుకుంటూ… తన వ్యాపారాన్ని అగ్రభాగాన నిలబెట్టేలా వినూత్న ఆలోచనలకు పదును పెడుతున్నాడు.
అతిరథ మహారథుల ప్రశంసల జల్లు
కలకత్తా వేదికగా గ్లోబల్ ఫేమ్ అవార్డ్స్ 2021 అవార్డు పొందిన ప్రముఖులలో అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి దివ్యేష్ కావడం గమనార్హం. దేశంలో వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన ప్రముఖులకు ఈ వార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. అతి పిన్న వయసులో యువ పారిశ్రామికవేత్త అవార్డును పొందిన విద్యార్థి దివ్యేష్ ను పలు రంగాల ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.
అందరూ మెచ్చేలా టౌలైట్ బ్రాండ్‌
టౌలైట్ బ్రాండ్‌ వస్త్ర వ్యాపారంలో తనదైన శైలిలో సత్తా చాటుతోంది. అందరూ మెచ్చేలా హై-క్వాలిటీతో హైదరాబాద్‌ వేదికగా టౌలైట్ బ్రాండ్‌ వస్త్ర వ్యాపారంలో ప్రత్యేకతను చాటుకుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించే “ని(అ)త్య”వసరంగా ఉన్న టవల్స్ లో వెండి ద్రావణంతో తయారు చేసిన యాంటీ
samba2మైక్రోబియల్ ప్రత్యేకత కలిగి ఉన్న టవల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో బ్యాక్టీరియాను దగ్గర రానివ్వకుండా వినూత్నంగా యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములాతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ టవల్స్ ప్రజలందరి మన్ననలు పొందాయి. 99% బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించేలా ప్రత్యేకంగా ఈ టవల్స్ ను రూపొందించారు. ఈ టవల్స్ అన్ని రకాల బ్యాక్టీరియాలను నాశనం చేసేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రూపొందించడం జరిగింది.
ఐదు రంగులలో మార్కెట్లోకి
దివ్యేష్ టౌలైట్ బ్రాండ్ టవల్స్ ను మొదట మార్కెట్లోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయాలు చేపట్టారు.అలాగే ప్రత్యేకంగా రూపొందించిన towelight.com.ద్వారా విక్రయాలు చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ టవల్స్ ఐదు రంగులలో మార్కెట్లోకి విడుదల చేశారు. జీరో-ట్విస్ట్ నూలు కాటన్ టవల్స్ ను అందిస్తున్నారు.520 జిఎస్ ఎంతో నీలం, ఆకుపచ్చ, పింక్,వైట్,బ్రౌన్ రంగులతో అందరూ మెచ్చేలా అందుబాటులో తీసుకొచ్చారు దివ్యేష్.

LEAVE A RESPONSE