హిందూ ధర్మమంటే అంత చులకనా?

– పోలీసులే దొంగలుగా మారి దేవుని విగ్రహాలను తొలగించడం ఎంత వరకు సబబు ?
– బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఊరుకోబోమని భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగురోజుల క్రితం త్రిపురాంతకంలో అయ్యప్ప స్వాములు స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారన్నారు.
ఆ మరుసటి రోజే దేవుని విహ్రాన్ని తొలగించడం దారుణమన్నారు. పోలీసు స్టేషన్ పరిధిలోని స్థలం అంటూ హిందువులు ఆరాధించే దేవతామూర్తుల విగ్రహాలను రాత్రికి రాత్రే తొలగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అన్నారు. హిందూ ధర్మమంటే అంత చులకనా…? అని ప్రశ్నించారు. ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాలను ఒక ప్రక్రియ ద్వారా తొలగించాల్సి ఉందన్నారు.
కానీ పోలీసులే దొంగలు గా మారి దేవుని విగ్రహాలను తొలగించడం ఎంత వరకు సబబు అని అన్నారు. ప్రశ్నించిన స్వాములపై కేసులు బనాయింయి, బెదిరింపులకు దిగడం దుర్మార్గమన్నారు. ఎక్కడ దేవుని విగ్రహాన్ని తొలగించారో, అక్కడ మళ్లీ పున ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. లేదంటే బిజేపి ప్రత్యేక ఆందోలనకు సిద్ధమౌతోందన్నారు. త్రిపురాంతక హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఈనెల 30న ఛలో త్రిపురాంతకం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు శిరసనగండ్ల పేర్కొన్నారు. దేవుని విగ్రహం ప్రతిష్టిస్తే సరి, లేదంటే తామే ఆ ప్రదేశంలో మళ్లీ పున: ప్రతిష్టిస్తామని హెచ్చంచారు.

Leave a Reply