Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడ పట్టణంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు చర్యలు

రూ. 2.15 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు
 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ పట్టణంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గుడివాడ పట్టణంలో తాగునీటి పరిస్థితిపై క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ తో మంత్రి కొడాలి నాని సమీక్షించారు .ఈ సందర్భంగా కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని 36 వార్డుల్లో ప్రతిరోజూ ఉదయం మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు . కొన్ని ఏరియాల్లో మంచినీటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు . గుడ్ మెన్ పేటలో మంచినీటి రిజర్వాయర్ నిర్మాణ దశలో ఉందని , ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందజేస్తున్నామని చెప్పారు . పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకవైపు జారిపోయిందని , దీన్ని ఇటీవల ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి వెళ్ళిందన్నారు . ఈ బ్యాంక్ లో మూడు మీటర్ల మేర తగ్గించి నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారన్నారు . రిజర్వాయర్ల ద్వారా జరుగుతున్న మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు .

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పట్టణంలోని 36 వార్డుల్లో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు . ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు . గుడ్ మెన్ పేట రిజర్వాయర్ నిర్మాణ దశలో ఉండడం , సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు సమస్యలు తలెత్తడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల రోజువారీ అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . మంచినీటి బోర్లను పరిశీలించాలన్నారు . పనిచేయని బోర్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు .
అవసరమైన ప్రాంతాల్లో మంచినీటి బోర్లను ఏర్పాటు చేయాలన్నారు . పలు ప్రాంతాల్లో అమృత్ పథకంలో భాగంగా మంచినీటి పైప్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ పైప్ లైన్ల ద్వారా కూడా మంచినీరు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు . మంచినీటి పైప్ లైన్లకు లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ఎప్పటికపుడు పైలైన్ వ్యవస్థను పర్యవేక్షించడంతో పాటు లీకేజీలు ఏర్పడిన వెంటనే మరమ్మతులు జరపాలని సూచించారు . కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ల ద్వారా కూడా మంచినీటిని సరఫరా జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని , అటువంటి ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలన్నారు . వేసవిలో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు అవసరమైన మంచినీటి ట్యాంకర్లను కూడా సమకూర్చుకోవాలన్నారు . సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా బోర్ల మరమ్మతులు , నూతన బోర్ల ఏర్పాటు , పైప్ లైన్లకు మరమ్మతులు , మంచినీటి ట్యాంకర్ల ఏర్పాటు తదితరాలకు అధికారులు రూ .2.15 కోట్లతో అంచనాలను రూపొందించారని , వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు . ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ , వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను , మండల తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE