వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు జరిగేలా చూస్తున్నాం

 బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని

వినియోగదారుల చట్టం -1986 స్థానంలో రూపొందించి అమల్లోకి తీసుకువచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం -2019 క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా అమలు జరిగేలా చూస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు .

బుధవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని కన్జ్యూమర్ అసోసియేషన్ ఫర్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ అధ్యక్షురాలు దారా కరుణశ్రీ కలిశారు . ఈ సందర్భంగా వినియోగదారుల అవగాహన కోసం తమ సంస్థ రూపొందిస్తున్న కార్యక్రమాలను వివరించారు . కన్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ వీల్స్ పేరుతో వినూత్న రీతిలో కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు . వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రజల వద్దకే వెళ్ళి వారికి అర్ధమయ్యే విధంగా తెలియజేస్తామన్నారు . ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటగా ఒక మొబైల్ వాహనాన్ని త్వరలో మంత్రి కొడాలి నాని చేతులమీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు .
 సీఎం జగన్మోహనరెడ్డి , మంత్రి కొడాలి నాని చిత్రాలతో కూడిన కన్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ వీల్స్ వాహనం ద్వారా సామాన్య మానవుడికి కూడా వినియోగదారుల చట్టంపై అవగాహనను పెంచుతామని , విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని దారా కరుణశ్రీ చెప్పారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధి , ఫిర్యాదు అంశాలు , అనుచిత వ్యాపార పద్ధతుల పరిధి విస్తృతి , ప్రాంతపు అధికార హద్దు రద్దు , వస్తు జవాబుదారీతనం , ద్రవ్య అధికార పరిధి పెంపు , మధ్యవర్తిత్వ పద్దతులకు చట్టరక్షణ , అహేతుక ఒప్పందాలు , కేంద్రీయ వినియోగదారుల రక్షణ అథారిటీ , వినియోగదారుల చైతన్యమే చట్ట అమలుకు పునాది తదితరాలపై ప్రభుత్వ , స్వచ్చంధ సంస్థలు , వినియోగ ఉద్యమ కార్యకర్తలు సమన్వయంతో సరైన కార్యక్రమాలు , విస్తృత అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి కొడాలి నాని సూచించారు.

Leave a Reply