Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలకు దూరంగా… భారంగా జగన్ రెడ్డి ప్రభుత్వం

– విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాటం
– శ్రీకాకుళం జిల్లాలో జోనల్ లెవెల్ ఓరియెంటేషన్ క్యాంప్
– ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్

విజయవాడ : రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు దూరంగా… భారంగా తయారైందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. దేశాన్ని నాశనం చేస్తున్న వారికి, ప్రజలను విచ్ఛిన్నం చేసే శక్తులకు, ఆర్ ఎస్ ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను విభజించి దేశాన్ని అమ్మేస్తున్నారని ద్వజమెత్తారు.

శ్రీకాకుళం జిల్లాలో జోనల్ లెవెల్ ఓరియెంటేషన్ క్యాంప్ ను సోమవారం శైలజానాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అవసరమైన రాజకీయ పరిజ్ఞానం కోసం, పార్టీ నిర్మాణం కోసం ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయటం జరిగిందని, వారు దేశంలో సెక్యులరిజం, ప్రజల సంక్షేమాన్ని కాపాడడం కోసం పని చేస్తారని వివరించారు. పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో, ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై అవగాహన కోసం ఈ క్యాంప్ నిర్వహించినట్లు వివరించారు.

LEAVE A RESPONSE