Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసి అవమానించింది

– ప్రభుత్వంపై ఉద్యోగులకు ఎంత ఆక్రోశం ఉందో నేటి ధర్నాతోనైనా జగన్ కి కనువిప్పు కలగాలి
– తక్షణమే ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరించాలి
– పర్చూరి అశోక్ బాబు

ఉద్యోగస్తులంటే ఏంటో ,ఉద్యోగుల అసంతృప్తి ఎలా ఉంటుందో నేడు ముఖ్యమంత్రి జగన్ కి తెలిసిందని ఇకనైనా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పట్ల ఉద్యోగుల్లో ఎంత ఆక్రోశం ఉందో నేటి ధర్నాతోనైనా ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలి.

నేడు సుమారు ‎ లక్ష యాభై వేల మంది విజయవాడ వచ్చి ‎ఉద్యోగులు కదం తొక్కారు. ఇంకా వేలాదిమంది ఉద్యోగులు దారిలో ఆగిపోయారు. పోలిసులు కూడా ఉద్యోగులే అన్న విషయం ‎ జగన్ మోహన్ రెడ్డి మర్చిపోవద్దు. అందుకే పోలీసులు కూడా నేడు ఉద్యోగుల నిరసనలకు సహకారం అందించారు. ఎందుకు అంటే పోలీసుల జీతాలు కూడా తగ్గాయి అది జగన్ కి తెలుసో లేదో. ‎‎ ఉద్యోగులతో మాట్లాడానికి ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? మీరు రాష్ట్రాన్ని నడపాలి‎ అంటే ఉద్యోగులు అవసరం లేదా? మీ వాలంటీర్లతో రాష్ట్రం నడుస్తుందా?

ఉద్యోగుల ప్రాధాన్యత ఏంటో మీకు తెలియకపోవడం ‎ రాష్ట్ర ప్రజల ‎ దురదృష్టం. 27 శాతం ప్రైస్ ఇండెక్స్ ఉంటే మీరు దానికి మించి ఫిట్మెంట్ ఇవ్వాలి. . కానీ ‎ ఐ.ఆర్ కన్నా తగ్గించి 23 శాతానికే పరిమితం చేశారు. హెచ్.ఆర్,ఏ స్లాబ్ కేంద్ర ప్రభుత్వ స్లాబుల ప్రకారం ఇవ్వడం భారీగా తగ్గించారు. అసలు కేంద్ర ప్రభుత్వ స్కేలుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమి ఉంది? పక్కన తెలంగాణ 30 శాతం ఇవ్వడం జరిగింది. మీరు బెదరించో, బుజ్జగించి మీరు ఉద్యోగ సంఘ నాయకులను ఒప్పించవచ్చు కానీ ఉద్యోగులను ఒప్పించలేరు. ఉద్యోగులు అంటే మీ దగ్గరకు వచ్చే నలుగురు నాయకులు కాదు.

ఈ రోజు బి.ఆర్.టి.స్ రోడ్డులో ఉన్న వారు ఉద్యోగులు. ఉద్యోగుల‎ డిమాండ్లకు తగ్గటు పని చేయకపోతే నాయకత్వం ఉండదు. మీరు పెట్టిన కోతలు కన్నా మీరు చేసిన అవమానాలకు ఎక్కువగా ఉద్యోగులు

స్పందించారు. ఉద్యోగస్తులతో మాట్లాడానికి ఒక అరగంట తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక రోజంతా ‎ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. కానీ ఆయన కుమారుడిగా ఉన్న మీరు ఎన్ని సార్లు ఉద్యోగ సంఘాలను అవమానిస్తారు? సజ్జల మీకు సలహాదారు కాని ఉద్యోగులకు కాదు. ఉద్యోగులు సలహదారులతో చర్చలు జరపాలా?

ఏ ఉద్యోగులు, మహిళలు మీకు ఓటు వేశారో వారే నేడు మీరు దిగిపోవాలి అంటున్నారు. వారే కాదు చాలా మంది వైసీపీ నాయకులు కూడా అదే మాట అంటున్నారు. మా నాయకుడికి అవగాహన లేదు అని చెబుతున్నారు. అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోండి అంతేకాని ఇలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదు. మీరు మీ పద్దతి మార్చుకోకపోతే ఏదైతే ఉద్యోగులు ‎మీరు దిగిపోవాలని అంటున్నారో ‎అదే జరుగుతుంది.

ఇది రాజకీయంగా చెబుతున్నా మాట కాదు.. లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే వారి మనోభావాలు ఎంతలా దెబ్బతిన్నాయో ఆలోచించాలి. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా ఒక్క డిమాండ్ షరిష్కంచలేదు. సంవత్సరం వేచి చూశాం, ఇక తప్పదని ‎ హైదరాబాద్ లో మహాధర్నా చేశాం. తర్వాత ఆయన పదవి నుంచి తొలిగిపోయి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వారం రోజుల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు. ఉద్యోగుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరిగా లేదు. ‎ అర్దరాత్రి జీవోలిచ్చి… దుర్మార్గంగా సీఎం.ఎప్.ఎస్ వ్యవస్ధను అడ్డుపెట్టుకొని ఆ జీవోల ప్రకారమే జీతాలు ‎ వేశారు.

ప్రతి నెలా ఒకటో తేదీన ఎందుకు జీతాలు వేయలేదు? ఉద్యోగుల పట్ల కక్ష్యపూరిత వైఖరి మంచిది కాదు. నేడు ఉద్యోగుల చేసిన ధర్నా ‎ ట్రయలర్ మాత్రమే. రేపు ఆర్టీసీ, విద్యుత్, మెడికల్ ఉద్యోగలు అందరూ రోడ్లమీదకు వస్తారు. గతంలో న్యూయార్క్ లో కరెంట్ పోతే బిలియనీర్స్ అందరూ రోడ్ల మీదకు వచ్చారు. ఉద్యోగుల అన్ని వ్యవస్దలను స్తంభింపచేస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ప్రభుత్వం ఇకనైనా తప్పుల్ని సరిదిద్దుకుని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి ‎వారి డిమాండ్లు పరిష్కరించాలి. ‍

హె.చ్ ఆర్. ఏ తగ్గించారని ఇంటి యజమానులు అద్దెలు తగ్గించరు కదా. 60 శాతం మంది ఉద్యోగులు అద్దె ఇళ్లల్లోనే ఉంటారు. హెచ్, ఆర్. ఏ తగ్గించటం దుర్మార్గం. ఓ వైపు జీతాలు పెంచలేదు, మరో వైపు కేంద్రం నుంచి ఇన్ కమ్ ట్యాక్స్ లో వెసులు బాటు లేదు. మీరు పెంచిన జీతాల్లో మళ్లీ ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగులకు అన్యాయం చేసి అవమానించారు కాబట్టే ఉద్యోగులంతా రోడ్డు మీదకు వచ్చారు. ఒక్క ఉద్యోగులే కాదు వైసీపీ పాలనలో అన్ని వర్గాలు పరిస్థితి అంతే ఉంది. ఉద్యోగుల్ని రాజకీయ పార్టీ కార్యకర్తల్ని వేధించినట్టు వేదిస్తే వాళ్లు తిరగబడక తప్పదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉద్యోగుల యుద్దాన్ని ఆపలేరు.

ఈ యుద్దంలో ఎవరు గెలిచినా నష్టపోయిదే ప్రజలే. ఎవ‎రూ ఊహించని విధంగా నేడు ధర్నా విజయవంతం అయింది. ఉద్యోగులకు ప్రభుత్వం పై ఉన్న ఆక్రోశంమే ఈ పరిస్దితికి కారణం. ఉద్యోగుల న్యాయపోరాటానికి టీడీపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అశోక్ బాబు అన్నారు.

LEAVE A RESPONSE