ఎలన్ మస్క్ చెప్పిన విధంగా ఐరాసకు భారీ విరాళం ప్రకటించారు. ప్రపంచంలోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై గతంలో ఎలన్ మస్క్ స్పందించిన సంగతి తెలిసిందే. చిన్నారుల ఆకలి తీర్చేందుకు తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన టెస్లా కంపెనీలోని 5 మిలియన్ షేర్లను చిన్నారుల ఆకలిని తీర్చడం కోసం ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ 5 మిలియన్ షేర్ల విలువ సుమారు రూ. 43 వేల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు టెస్లా వాటాలోని తన 5 మిలియన్ షేర్లను విరాళంగా ఇచ్చినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ పేర్కొన్నది.
ప్రపంచంలో అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒకటిని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ విరాళంను ఎలన్ మస్క్ ఏ సంస్థకు అందించారనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎలన్ మస్క్ వంటి వ్యక్తులు తలచుకుంటే ప్రపంచంలోని 6.2 కోట్ల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు
ఇవ్వడం ఇక లెక్కకాదని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఇచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేస్తారో ప్రణాళిక ఇస్తే 6 బిలియన్ డాలర్లు ఇప్పటికిప్పుడే ఇస్తానని గతంలో మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే మస్క్ 4.2 కోట్ల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు 5.7 బిలియన్ డాలర్లను విరాళంగా అందించారు.