-జగన్ సర్కార్ పై లోకేష్ సెటైర్లు
ఎన్ని కేసులు మెడకి చుట్టుకున్నా జగన్ రెడ్డి ఆయన మనుషులు సూట్‌కేసు కంపెనీల బుద్ధి మాత్రం పోనిచ్చుకోరు. దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీకుర్చీలతో గౌరవ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద ఎంవోయూ కుదుర్చుకున్నారు. అందులో ఒకటి 2021 జూన్ 4న లక్ష రూపాయల పెట్టుబడితో రిజిస్టర్ అయిన కాజిస్ ఈ మోబిలిటి ప్రవేట్ లిమిటెడ్( Causis e-mobility private limited ) ఒకటి. ఏడాది కూడా కాని అనామకులు పెట్టిన ఈ కంపెనీ రాష్ట్రంలో 3 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని, ఇక ఉద్యోగాల జాతరేనని డప్పుకొడుతున్నారు.
పేరు చెప్పుకోలేని ఇంకో కంపెనీతో జరిగిన ఒప్పందంలో 300 హైఎండ్ జాబ్స్ అట. అంత హై ఎండ్ అంటే వలంటీర్లే కదా! ఆ పేరు చెప్పుకోలేని కంపెనీ ఏ2 గారి సూట్‌కేసులో కంపెనీయే అయ్యుంటుంది. ఫేక్ పార్టీ, ఫేక్ పాలన, ఫేక్ మాటలు, ఫేక్ రాతలు, చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా ఫేక్ ఎంవోయూలు. థూ…మీ బతుకు చెడ అని వైసిపి నాయకుల్ని ప్రజలు ఛీత్కరించుకోవడంలో తప్పేముంది?